సమ్మర్‌లో భయపెడతా | Raghava Lawrence's 'Kanchana 3' release date announced | Sakshi
Sakshi News home page

సమ్మర్‌లో భయపెడతా

Nov 16 2018 2:28 AM | Updated on Nov 16 2018 2:28 AM

Raghava Lawrence's 'Kanchana 3' release date announced - Sakshi

రాఘవ లారెన్స్‌

సమ్మర్‌లో చల్లని థియేటర్‌లో ప్రేక్షకులను భయపెట్టడానికి రెడీ అయ్యారు రాఘవ లారెన్స్‌. ఆయన దర్శకత్వంలో 2007లో వచ్చిన ‘ముని’ చిత్రానికి సీక్వెల్స్‌గా ‘కాంచన (ముని 2), కాంచన 2 (ముని 3)’ చిత్రాలు రూపొందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘కాంచన 3’ సెట్స్‌పై ఉంది. రాఘవ లారెన్స్‌నే దర్శకత్వం వహిస్తున్నారు. ఓవియా, వేదిక కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పుడీ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 18న రిలీజ్‌ కానుందని ప్రచారం జరుగుతోంది. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్‌ తుది దశకు చేరుకుంది. టాకీ పార్ట్‌ ఆల్మోస్ట్‌ కంప్లీట్‌ అయ్యిందని వినికిడి. ఇంతకుముందు ‘ముని’ ఫ్రాంచైజీలో వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద సక్సెస్‌ కావడంతో ‘కాంచన 3’పై అంచనాలు ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement