కలత చెందిన లారెన్స్‌

Raghava Lawrence Tells Fan Do Not Take Such Risks - Sakshi

చెన్నై: అభిమానుల అత్యుత్సాహంపై నృత్య దర్శకుడు, సినీ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్‌ కలత చెందారు. తన కోసం ఎటువంటి ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. కాంచన 3 సినిమా విడుదల సందర్భంగా అభిమానులు లారెన్స్‌ కటౌట్‌కు పాలాభిషేకం చేశారు. ఓ అభిమాని ఏకంగా హుక్కులతో క్రేన్‌కు వేళాడుతూ లారెన్స్‌ కటౌట్‌కు పూలదండ వేసి, పాలతో అభిషేకించాడు. సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో చూసి లారెన్స్‌ స్పందించారు. తన కోసం ఇలాంటి రిస్క్‌లు చేయొద్దని అభిమానులను కోరారు.

తనపై అభిమానాన్ని చూపడానికి సాహసాలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇలాంటివి చేసే ముందు అభిమానులు తమ కుటుంబ సభ్యుల గురించి ఆలోచించాలని హితవు పలికారు. ‘నా మీద మీకున్న ప్రేమను చూపాలనుకుంటే స్కూల్‌ ఫీజు, పుస్తకాలు అవసరమైన పిల్లలకు సహాయం చేయండి. చాలా మంది వృద్ధులు అన్నం దొరక్క ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వారికి సాయపడండి. ఇలాంటివి చేస్తే నేనెంతో ఆనందిస్తాను, గర్వపడతాను. అంతేకాని మీ జీవితాన్ని ప్రమాదంలో పడేసే సాహస కార్యాలను ప్రోత్సహించను. మీ ప్రాణాలు ఎంతో విలువైనవని గుర్తించండి. దయచేసి మరోసారి ఇలాంటి సాహసాలు చేయొద్ద’ని లారెన్స్‌ విజ్ఞప్తి చేశారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top