రజనీతో లారెన్స్‌ సినిమా?

Raghava Lawrence to direct Rajinikanth next - Sakshi

రజనీకాంత్‌కి కొరియోగ్రాఫర్, డైరెక్టర్‌ రాఘవ లారెన్స్‌ వీరాభిమాని. తన అభిమాన హీరోని డైరెక్ట్‌ చేయాలని ఏ డైరెక్టరైనా అనుకుంటారు. లారెన్స్‌ కూడా అనుకున్నారు. ఇప్పుడు ఆ కల నిజం కాబోతోందని కోలీవుడ్‌ టాక్‌. రజనీకాంత్‌ చేయబోయే తదుపరి చిత్రాల్లో లారెన్స్‌ సినిమా కూడా ఒకటనే వార్త తమిళ ఇండస్ట్రీలో ప్రచారంలో ఉంది. ప్రస్తుతం శివ దర్శకత్వంలో ‘అన్నాత్తే’ అనే సినిమా చేస్తున్నారు రజనీ. అది రజనీ కెరీర్‌లో 168వ సినిమా. ఆ తర్వాత కమల్‌హాసన్‌ బ్యానర్‌లో ఓ సినిమా (169వ చిత్రం) కమిట్‌ అయ్యారు. 170వది రాఘవ లారెన్స్‌ సినిమా అవుతుందని టాక్‌. ప్రస్తుతం రజనీతో కథా చర్చలు జరుపుతున్నారట లారెన్స్‌. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top