త్వరలో ఇంగ్లీష్‌ క్లాసులు | Radhika Apte to play Irrfan's wife in Hindi Medium 2 | Sakshi
Sakshi News home page

త్వరలో ఇంగ్లీష్‌ క్లాసులు

Feb 18 2019 4:00 AM | Updated on Feb 18 2019 4:00 AM

Radhika Apte to play Irrfan's wife in Hindi Medium 2 - Sakshi

రాధికా ఆప్టే

వేసవిలో విద్యార్థులకు సెలవులు ఇస్తారు. కానీ బాలీవుడ్‌ నటుడు ఇర్ఫాన్‌ఖాన్‌ కెమెరా ముందు ‘ఇంగ్లీష్‌ మీడియం’ క్లాసులను స్టార్ట్‌ చేయాలనుకుంటున్నారట. ఇర్ఫాన్‌ఖాన్, సాబా క్వామర్, దీపక్‌ డోబ్రియల్, షాయన్న పటేల్‌ ముఖ్య తారలుగా రూపొందిన ‘హిందీ మీడియం’ చిత్రం గతేడాది బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌హిట్‌ అయింది. సాకేత్‌ చక్రవర్తి దర్శకుడు. ఈ సినిమాకు సీక్వెల్‌ రూపొందనున్నట్లు ఆ మధ్య బాగానే ప్రచారం జరిగింది. అయితే ఇర్ఫాన్‌ఖాన్‌ క్యాన్సర్‌ చికిత్స కోసం లండన్‌ వెళ్లడంతో ‘హిందీ మీడియం’ సీక్వెల్‌ ప్రశ్నార్థకంగా మారింది.

ఇటీవల ఆయన ముంబైకి తిరిగిరావడంతో సీక్వెల్‌పై మళ్లీ ప్రచారం ఊపందుకుంది. ఇర్ఫాన్‌ నటించేందుకు ఓకే చెప్పారని, సమ్మర్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని  టాక్‌. ఈ చిత్రానికి హోమి అడజానియా దర్శకత్వం వహిస్తారట. ఇందులో కథానాయిక పాత్ర కోసం రాధికా ఆప్టేను సంప్రదించగా ఆమె గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారట. ఈ సినిమాకు ‘ఇంగ్లీష్‌ మీడియం’ అనే టైటిల్‌ పెట్టాలనుకుంటున్నారని వినికిడి. ఇందులో ఇర్ఫాన్‌ కూతురిగా ‘పటఖా’ ఫేమ్‌ రాధిక మాదన్‌ కనిపిస్తారని సమాచారం. 

Advertisement
 
Advertisement
Advertisement