నా పేరే ఎందుకు? | Radhika Apte and Dev Patel hot scene gets leaked from The wedding guest | Sakshi
Sakshi News home page

నా పేరే ఎందుకు?

Jul 19 2019 12:13 AM | Updated on Jul 19 2019 12:13 AM

Radhika Apte and Dev Patel hot scene gets leaked from The wedding guest - Sakshi

రాధికా ఆప్టే

రిలీజ్‌ కాని సినిమాలకు చెందిన క్లిప్పింగ్‌లు, స్టిల్స్‌ అప్పుడప్పుడు నెట్‌లో వైరల్‌ కావడం ఈ టెక్నాలజీ యుగంలో సాధారణ విషయమై పోయింది. హీరోయిన్‌ రాధికా ఆప్టే తాజాగా నటించిన ‘ది వెడ్డింగ్‌ గెస్ట్‌’ సినిమా రొమాంటిక్‌ సీన్‌ ఒకటి నెట్‌లో వైరల్‌గా మారింది. అది దేవ్‌ పటేల్, రాధికా ఆప్టే మధ్య సాగే శృంగార సన్నివేశం. ఈ వీడియోకి సంబంధించిన ఫొటోలు ‘రాధికా ఆప్టే ఇన్‌ లీక్డ్‌ సెక్స్‌ సీన్‌’ అని ఎక్కువగా నెట్‌లో తిరుగుతోంది. ఈ విషయంపై రాధికా ఆప్టే స్పందించారు.

‘‘ది వెడ్డింగ్‌ గెస్ట్‌’ సినిమాలో బోలెడన్ని రొమాంటిక్‌ సీన్స్‌ ఉన్నాయి. అందుకో హైలీ రొమాంటిక్‌ సీన్‌ ఒకటి లీకైంది. కానీ ‘రాధికా ఆప్టే ఇన్‌ లీక్డ్‌ సెక్స్‌ సీన్‌’ అని నా పేరుతోనే ఎందుకు? ఇది ప్రచారం అవుతుందో నాకు అర్థం కావడం లేదు. అందులో దేవ్‌ పటేల్‌ కూడా ఉన్నారు కదా. హీరో పేరుతో కాకుండా హీరోయిన్‌ పేరుతో ఎందుకు వైరల్‌ చేస్తున్నారు. సొసైటీలో ఉన్న సైకో మెంటాలిటీస్‌ వల్ల ఇలాంటివి జరుగుతున్నాయనిపిస్తోంది’’ అన్నారు రాధిక. మూడేళ్ల క్రితం ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నారు రాధికా ఆప్టే. అప్పుడు లీకైన వీడియోలో నటుడు రాధికా ఆప్టేతో నటుడు ఆదిల్‌ హుస్సేన్‌ ఉన్నారు. అప్పుడు కూడా రాధికా ఇలానే స్పందించారు.

Advertisement
 
Advertisement
Advertisement