
విశాల్‌ను టార్గెట్ చేసిన రాధారవి
చెన్నై : ప్రముఖ నటి నయనతారపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు రాధారవి తీరును పలువురు కోలీవుడ్ నటులు, సెలబ్రిటీలు తప్పుపడుతున్నారు. రాధారవి వ్యవహార శైలి మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఆయన వ్యాఖ్యలపై నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి, ప్రముఖ నటుడు విశాల్ భగ్గుమన్నారు.
రాధారవి తన పేరుముందున్న రాధాను తొలగించుకోవాలని లేకుంటే మహిళలకు అన్యాయం చేసినట్టవుతుందని విశాల్ ఘాటుగా ట్వీట్ చేశారు. విశాల్ ట్వీట్‌పై రాధారవి స్పందించారు. తన పేరు ముందున్న పదాన్ని ప్రస్తావిస్తూ ‘ఇది ఆర్‌కే నగర్ లాంటిదే..విశాల్ ఏమీ తెలియకుండానే మాట్లాడుతున్నాడు..రాధ మా తండ్రి పేరు..అందుకే ఈ పేరు పెట్టుకున్నా’నని రాధారవి పేర్కొన్నారు.
కాగా,నయనతార నటించిన ఓ మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో ఆమెను ఉద్దేశించి రాధారవి చేసిన వ్యాఖ్యలు కలకలంరేపిన సంగతి తెలిసిందే. మరోవైపు వేదికపై ఆయన చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు, ప్రవర్తనకు గాను ఆయనను డీఎంకే సస్పెండ్ చేసింది.