సిడ్నీ ఎయిర్‌పోర్టులో మ్యూజిక్‌ డైరెక్టర్‌కి అవమానం

Racial Profiling on Kollywood Music Director - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi

సాక్షి, సినిమా :  కోలీవుడ్ మ్యూజిక్‌ డైరెక్టర్‌ సంతోష్‌ నారాయణన్‌ జాతి వివక్షతకు గురైనట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్‌ అకౌంట్‌లో తెలియజేశారు. సిడ్నీ ఎయిర్‌పోర్టులో ఆయనతో ఓ అధికారి దురుసుగా ప్రవర్తించినట్లు ట్వీట్‌ చేశారు. అయితే ఎయిర్‌పోర్టు శాఖ మాత్రం ఆయన చేసిన ఆరోపణలను ఖండించింది.

రెండు రోజల క్రితం ఆయన చేసిన ట్వీట్‌ ప్రకారం... సిడ్నీ వెళ్లిన ఆయనను ఎయిర్‌పోర్టులో భద్రతా సిబ్బంది అడ్డగించారు. నిషేధిత రసాయనాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై ఆయన్ని అడ్డగించి.. పక్కన ఓ వరుసలో నిలబెట్టారు. అలా 8 సార్లు ఆయన్ని క్యూలు మార్చి మరి తనిఖీలు చేశారు.  ఈ క్రమంలో ఓ అధికారి ఆయనతో దురుసుగా కూడా వ్యవహరించినట్లు ఆయన చెప్పారు. ఇది దారుణం.. జాతి వివక్షతకు అడ్డుకట్టపడాల్సిన అవసరం ఉంది అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

అయితే ఎయిర్‌పోర్టు శాఖ మాత్రం తనిఖీల్లో భాగంగానే తమ అధికారులు అలా చేసుంటారని వరుస ట్వీట్లలో వివరణ ఇచ్చుకుంది. దానికి సంతృప్తి చెందని సంతోష్‌ నారాయణన్‌... భద్రత కోసమైతే వందసార్లు తాను వరుసలో నిల్చోటానికి సిద్ధమని, కానీ, కొందరు అధికారులు ఆ వంకతో వ్యక్తిగతంగా జాతి వివక్షత చూపించటం దారుణమని ఆయన ఆరోపించారు. డైరెక్టర్‌ పా రంజిత్‌ అటకత్తి చిత్రంతో ఆరంగ్రేటం చేసిన సంతోష్‌.. గురు, మద్రాస్‌ తదితర చిత్రాలకు మ్యూజిక్‌ అందించినప్పటికీ... కబాలితో బాగా పాపులర్‌ అయ్యారు. ప్రస్తుతం రజనీకాంత్‌ కాలా చిత్రానికి కూడా ఆయనే సంగీతం అందిస్తుండటం విశేషం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top