సూపర్‌ మచ్చీ | A R Rahman, Keerthy Suresh join Vijay's next with AR Murugadoss | Sakshi
Sakshi News home page

సూపర్‌ మచ్చీ

Jan 7 2018 1:43 AM | Updated on Jan 7 2018 12:07 PM

A R Rahman, Keerthy Suresh join Vijay's next with AR Murugadoss - Sakshi

మురుగదాస్‌ దర్శకత్వంలో విజయ్‌ హీరోగా ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఇందులో సమంత, కాజల్, అనుష్క.. వీళ్లలో ఒకరు హీరోయిన్‌ అని, అనిరు«ద్‌ సంగీతం అందిస్తాడని ఊహాగానాలు వినిపించాయి. ఈ ఊహాగానాలన్నింటికీ తెర దించుతూ చిత్రనిర్మాణ సంస్థ సన్‌ నెట్‌వర్క్‌ ఆర్టిస్ట్స్, టెక్నీషియన్ల వివరాలను ప్రకటించింది. ఇందులో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటించనున్నారు.

ఎ.ఆర్‌. రెహమాన్‌ సంగీత దర్శకుడు. ‘కలి, అంగమలై డైరీస్‌’ వంటి మలయాళ సినిమాలకు కెమెరామెన్‌గా పని చేసిన గిరీశ్‌ గంగాధరన్‌ ఈ సినిమాకు ఛాయాగ్రాహకుడు. హై బడ్జెట్‌ స్టైలిష్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమాలో విజయ్‌ లుక్‌కు సంబంధించిన టెస్ట్‌షూట్‌ ఇటీవల జరిగింది. షూట్‌లో భాగంగా రోల్స్‌ రాయిస్‌ కార్‌ను ఆనుకొని స్టైల్‌గా సిగార్‌ తాగుతున్న విజయ్‌ ఫొటోలు, ఓ చిన్న వీడియో లీక్‌ అయ్యాయి. లుక్‌ సూపర్‌ మచ్చీ (సూపర్‌ మామ) అని విజయ్‌ ఫ్యాన్స్‌ సంబరపడిపోతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement