నటుడు శ్రీకాంత్‌ ఇంటికి వెళ్లిన మంత్రులు | Puvvada Ajay Kumar Condoles Actor Srikanth Father Demise | Sakshi
Sakshi News home page

శ్రీకాంత్‌కు తెలంగాణ మంత్రుల పరామర్శ

Feb 19 2020 3:44 PM | Updated on Feb 19 2020 3:55 PM

Puvvada Ajay Kumar Condoles Actor Srikanth Father Demise - Sakshi

టాలీవుడ్ హీరో శ్రీకాంత్‌ను తెలంగాణ మంత్రులు బుధవారం ప‌రామ‌ర్శించారు.

సాక్షి, హైదరాబాద్‌: తండ్రి మ‌ర‌ణంతో విషాదంలో ఉన్న టాలీవుడ్ హీరో శ్రీకాంత్‌ను తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్‌, పువ్వాడ అజ‌య్ కుమార్‌ బుధవారం ప‌రామ‌ర్శించారు. ఫిలింన‌గ‌ర్‌లోని శ్రీకాంత్ ఇంటికి వెళ్లి మంత్రి వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, త‌మ ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు. ఎమ్మెల్సీ నవీన్ యాదవ్, ఎమ్మెల్సీ ప్రభాకర్ కూడా శ్రీ​కాంత్‌ను పరామర్శించారు.

ఊపిరితిత్తుల వ్యాధితో బాధ‌ప‌డుతూ తీవ్ర అనారోగ్యంతో రెండ్రోజుల క్రితం హీరో శ్రీకాంత్ తండ్రి మేక ప‌ర‌మేశ్వ‌రరావు తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ప‌ర‌మేశ్వ‌రరావు మరణం పట్ల పలువురు సినిమా ప్రముఖులు సంతాపం తెలిపారు. హీరోలు చిరంజీవి, గోపీచంద్‌, నిర్మాత అల్లు అరవింద్ తదితరులు శ్రీకాంత్‌ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. (శ్రీకాంత్‌కు పితృవియోగం)

 

Advertisement
 
Advertisement
Advertisement