
మమ్ముట్టి, స్వరాజ్ గ్రామిక ముఖ్యతారలుగా రంజిత్ దర్శకత్వంలో రూపొందిన మలయాళ చిత్రం ‘పుతన్ పనమ్’ని తెలుగులోకి అనువదిస్తున్నారు. ‘జయహో నాయకా’ టైటిల్‌తో కల్లూరి వెంకట సుబ్బయ్య సమర్పణలో కల్లూరి శేఖర్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ‘‘మలయాళంలో మంచి విజయం సాధించిన చిత్రమిది. ధర్మం, నీతి, నిజాయితీ గల గ్యాంగ్‌స్టర్ పాత్రలో మమ్ముట్టి కనిపిస్తారు. ఓ గ్యాంగ్ కారణంగా మిస్‌ఫైర్ అయిన తుపాకీ ఓ బాలుడికి దొరుకుతుంది. ఆ నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనే అంశాల ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుంది. షాన్ రెహమాన్ మంచి సంగీతం అందించారు’’ అని నిర్మాత పేర్కొన్నారు.