రోగ్‌కి జోడీ దొరికింది | puri jaganath rogue movie heroine pooja zhaveri | Sakshi
Sakshi News home page

రోగ్‌కి జోడీ దొరికింది

Dec 19 2015 11:11 AM | Updated on Mar 22 2019 1:53 PM

రోగ్‌కి జోడీ దొరికింది - Sakshi

రోగ్‌కి జోడీ దొరికింది

హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. తన దర్శకత్వంలో తెరకెక్కిన లోఫర్ సినిమా రిలీజ్ అయి వారం కూడా గడవక ముందే మరో సినిమా మొదలుపెట్టేశాడు

హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. తన దర్శకత్వంలో తెరకెక్కిన లోఫర్ సినిమా రిలీజ్ అయి వారం కూడా గడవక ముందే మరో సినిమాను సెట్స్ మీదకు తీసుకుకెళుతున్నాడు పూరి. ప్రముఖ నిర్మాత సిఆర్ మనోహర్ తనయుడు ఇషాన్ను హీరోగా పరిచయం చేస్తూ రోగ్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి తెరకెక్కనున్న ఈ బైలింగ్యువల్ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తిచేసిన పూరి త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు.

చాలా రోజులుగా ఈ సినిమాలో నటించే హీరోయిన్ విషయంలో భారీ చర్చ జరుగుతోంది. ఇషాన్ ఇంట్రడ్యూసింగ్ సినిమా కావటంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారు చిత్రనిర్మాతలు. అందుకు తగ్గట్టుగానే సౌత్లో ఫాంలో ఉన్న అమైరా దస్తర్ను హీరోయిన్గా ఫైనల్ చేశారు. అయితే ఆఖరి నిమిషంలో అమైరా డేట్స్ అడ్జస్ట్ కాకపోవటంతో మరో హీరోయిన్ను ఫైనల్ చేశారు. భం భోలేనాద్ సినిమాతో టాలీవుడ్కి పరిచయం అయిన పూజా జవేరిని హీరోయిన్గా ఫిక్స్ చేశారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

Advertisement
 
Advertisement
Advertisement