-
పైరేటెడ్ ప్రేమ
నవీన్‌చంద్ర హీరోగా, గాయత్రీ సురేష్, పూజా జవేరి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘హీరో హీరోయిన్’. ‘ఎ పైరేటెడ్ లవ్‌స్టోరీ’ అన్నది ఉపశీర్షిక. ‘అడ్డా’ సినిమా ఫేం జీయస్ కార్తీక్ దర్శకత్వం వహించారు. స్వాతి పిక్చర్స్ పతాకంపై భార్గవ్ మన్నె నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని గురువారం విడుదల చేశారు. జీయస్ కార్తీక్ మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకు తెలుగు సినీ పరిశ్రమలో పలు విభిన్న నేపథ్యాల్లో ప్రేమకథలు వచ్చాయి. కానీ ఎవరూ టచ్ చేయని సినిమా పైరసీ నేపథ్యంలో మా చిత్రం ఉంటుంది. ఈ లవ్‌స్టోరీలో అన్ని ఎమోషన్స్ ఉంటాయి. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు తప్పకుండా నచ్చే చిత్రమిది’’ అన్నారు. ‘‘కార్తీక్ చెప్పిన కథ మాకు ఎంతో నచ్చింది. అందుకే ఎక్కడా రాజీపడకుండా రిచ్‌గా ఈ చిత్రాన్ని నిర్మించాం. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. అతి త్వరలోనే సినిమా విడుదల చేస్తాం’’ అని తెలిపారు. అభిమన్యు సింగ్, కబీర్‌సింగ్, జయప్రకాష్ రెడ్డి, షేకింగ్ శేషు, రణధీర్, గౌతంరాజు, శివన్నారాయణ, బమ్చిక్ బబ్లూ, సారిక రామచంద్రరావు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: వెంకట్ గంగాధరీ. -
రోగ్‌కి జోడీ దొరికింది
హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. తన దర్శకత్వంలో తెరకెక్కిన లోఫర్ సినిమా రిలీజ్ అయి వారం కూడా గడవక ముందే మరో సినిమాను సెట్స్ మీదకు తీసుకుకెళుతున్నాడు పూరి. ప్రముఖ నిర్మాత సిఆర్ మనోహర్ తనయుడు ఇషాన్‌ను హీరోగా పరిచయం చేస్తూ రోగ్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి తెరకెక్కనున్న ఈ బైలింగ్యువల్ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తిచేసిన పూరి త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. చాలా రోజులుగా ఈ సినిమాలో నటించే హీరోయిన్ విషయంలో భారీ చర్చ జరుగుతోంది. ఇషాన్ ఇంట్రడ్యూసింగ్ సినిమా కావటంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారు చిత్రనిర్మాతలు. అందుకు తగ్గట్టుగానే సౌత్‌లో ఫాంలో ఉన్న అమైరా దస్తర్ను హీరోయిన్గా ఫైనల్ చేశారు. అయితే ఆఖరి నిమిషంలో అమైరా డేట్స్ అడ్జస్ట్ కాకపోవటంతో మరో హీరోయిన్ను ఫైనల్ చేశారు. భం భోలేనాద్ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం అయిన పూజా జవేరిని హీరోయిన్గా ఫిక్స్ చేశారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కిడ్నాప్ చేసి పక్కింట్లోనే 26 ఏళ్లుగా..
వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి: ఐదేళ్ల తర్వాత 11 మంది వైద్యులపై కేసు!
బీజేపీ నాయకులపై ఫిర్యాదు
బీజేపీ డబ్బులు తీసుకుని కాంగ్రెస్‌కు ద్రోహం
● ఎమ్మెల్యే పాయల్ శంకర్
కాంగ్రెస్ గెలుపు తథ్యం
అప్పుడు.. ఇప్పుడు
పంచదార.. ఇక లేనట్లేనా?
స్ట్రాంగ్.. భద్రత
లాఠీచార్జి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- కిడ్నాప్ చేసి పక్కింట్లోనే 26 ఏళ్లుగా..
- NOTA: నోటా.. కోరల్లేని పులి!
- అందానికే కాదు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అనసూయ.. బర్త్‌డే స్పెషల్ (ఫోటోలు)
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- పదేళ్ల తర్వాత.. చాట్‌జీపీటీ కంపెనీ కోఫౌండర్ సంచలన నిర్ణయం!
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- అజిత్ షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
- దేశంలో ఐఐఎం–అహ్మదాబాద్ టాప్
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
Advertisement