పైరేటెడ్‌ ప్రేమ | hero heroine movie press meet | Sakshi
Sakshi News home page

పైరేటెడ్‌ ప్రేమ

Feb 8 2019 4:09 AM | Updated on Feb 8 2019 4:09 AM

hero heroine movie press meet - Sakshi

నవీన్‌చంద్ర, గాయత్రీ సురేష్

నవీన్‌చంద్ర హీరోగా, గాయత్రీ సురేష్, పూజా జవేరి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘హీరో హీరోయిన్‌’. ‘ఎ పైరేటెడ్‌ లవ్‌స్టోరీ’ అన్నది ఉపశీర్షిక. ‘అడ్డా’ సినిమా ఫేం జీయస్‌ కార్తీక్‌ దర్శకత్వం వహించారు. స్వాతి పిక్చర్స్‌ పతాకంపై భార్గవ్‌ మన్నె నిర్మించిన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ని గురువారం విడుదల చేశారు. జీయస్‌ కార్తీక్‌ మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకు తెలుగు సినీ పరిశ్రమలో పలు విభిన్న నేపథ్యాల్లో ప్రేమకథలు వచ్చాయి. కానీ ఎవరూ టచ్‌ చేయని సినిమా పైరసీ నేపథ్యంలో మా చిత్రం ఉంటుంది. ఈ లవ్‌స్టోరీలో అన్ని ఎమోషన్స్‌ ఉంటాయి.

కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు తప్పకుండా నచ్చే చిత్రమిది’’ అన్నారు. ‘‘కార్తీక్‌ చెప్పిన కథ మాకు ఎంతో నచ్చింది. అందుకే ఎక్కడా రాజీపడకుండా రిచ్‌గా ఈ చిత్రాన్ని నిర్మించాం. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. అతి త్వరలోనే సినిమా  విడుదల చేస్తాం’’ అని తెలిపారు. అభిమన్యు సింగ్, కబీర్‌సింగ్, జయప్రకాష్‌ రెడ్డి, షేకింగ్‌ శేషు, రణధీర్, గౌతంరాజు, శివన్నారాయణ, బమ్‌చిక్‌ బబ్లూ, సారిక రామచంద్రరావు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్, కెమెరా: వెంకట్‌ గంగాధరీ.

Advertisement
 
Advertisement
Advertisement