బిగ్‌బాస్‌ : ఎలిమినేట్‌ అయ్యేదెవరో తెలిసింది! | Punarnavi Likely To Eliminated From Bigg Boss House Eleventh Week | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ : ఎలిమినేట్‌ అయ్యేదెవరో తెలిసింది!

Oct 6 2019 7:39 PM | Updated on Oct 7 2019 2:51 PM

Punarnavi Likely To Eliminated From Bigg Boss House Eleventh Week - Sakshi

బిగ్‌బాస్‌ వీకెండ్‌లో జరిగే ఎలిమినేషన్‌ ప్రక్రియ గురించే అందరు చర్చించుకుంటారనే సంగతి తెలిసిందే. అయితే ప్రతి వారం ఎవరు ఎలిమినేట్‌ అవుతున్నారనే దానిపై ఒకటి, రెండు రోజుల ముందుగానే బయటికి తెలియడంతో సస్పెన్స్‌ లేకుండా పోతోంది. దీంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్‌ అవుతారనే దానిపై బిగ్‌బాస్‌ చిన్నపాటి లాజికల్‌ గేమ్‌ ఆడినట్టుగా తెలుస్తోంది. మహేశ్‌ హౌజ్‌లో నుంచి వెళ్లిపోతున్నట్టు బిగ్‌బాస్‌ నుంచి లీక్‌లు వచ్చాయి. కానీ అందులో ఏ మాత్రం నిజం లేనట్టుగా తెలుస్తోంది. కాగా, ఈ వారం పునర్నవి హౌజ్‌ను వీడుతున్నట్టు సమాచారం.

అయితే గతంలో జరిగినట్టుగా కాకుండా ఈ వారం ఎలిమినేషన్‌ విషయంలో.. కొద్దిపాటి సస్పెన్స్‌ క్రియేట్‌ చేయడంలో బిగ్‌బాస్‌ నిర్వహకులు విజయవంతం అయ్యారనిపిస్తోంది. ఈ వారం రాహుల్‌, వరుణ్‌, పునర్నవి, మహేష్‌లు నామినేట్‌ కాగా.. తొలుత డబుల్‌ ఎలిమినేషన్‌ ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ చివరకు ఈ వారం ఎలిమినేట్‌ అయ్యేది ఒక్కరే అని తెల్సింది. ఆ నలుగురిలో రాహుల్‌ సేఫ్‌ అయినట్టు హోస్ట్‌ నాగార్జున శనివారం ఎపిసోడ్‌లో ప్రకటించారు. ఇక మిగిలిన ముగ్గురిలో వరుణ్‌ స్ట్రాంగ్‌ కంటెస్ట్‌ కాగా.. మహేశ్‌, పునర్నవిలలో ఎవరు ఎలిమినేట్‌ అవుతారనే దానిపైనే అందరు చర్చించడం ప్రారంభించారు. అయితే తాజా సమాచారం ప్రకారం పునర్నవి హౌజ్‌ నుంచి వెళ్లనున్నట్టుగా తెలిసింది. ఈ రోజు ఎపిసోడ్‌లో నవరాత్రి వేడుకల సందర్బంగా హౌస్‌మేట్స్‌ నవరసాలను ప్రదర్శించనున్నారు. మరోవైపు శనివారం సాగిన ఎపిసోడ్‌లో బ్యాటిల్ ఆఫ్ మెడాలియన్‌ను వితిక గెలిచినట్టుగా బిగ్‌బాస్‌ ప్రకటించాడు.

Advertisement
 
Advertisement
Advertisement