జోడీ కుదిరింది

Priyanshu Painyuli joins Taapsee Pannu starrer Rashmi Rocket - Sakshi

ఆకర్ష్‌ ఖురానా దర్శకత్వంలో తాప్సీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న లేడీ ఓరియంటెడ్‌ ఫిల్మ్‌ ‘రష్మీ: ద రాకెట్‌’. ఈ చిత్రంలో గుజరాత్‌కు చెందిన అథ్లెట్‌ రష్మీ పాత్రలో నటించనున్నారు తాప్సీ. ఇందులో తాప్సీ భర్తగా నటించబోతున్నారు ప్రియాన్షు పైన్యూలి. ఆయన ఆర్మీ ఆఫీసర్‌గా కనిపిస్తారు. ‘‘మా నాన్నగారు ఆర్మీ కల్నల్‌గా చేసి రిటైర్‌ అయ్యారు. నటుడు కాకముందు ఓ సమయంలో  నేను ఆర్మీలో జాయిన్‌ అవుదాం అనుకున్నాను. ఇప్పుడు ఆర్మీ ఆఫీసర్‌గా నటించబోతున్నందుకు హ్యాపీగా ఉంది’’ అన్నారు ప్రియాన్షు. ఈ షూటింగ్‌ ఈపాటికే కచ్‌లో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా షూటింగ్‌ను వాయిదా వేశారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top