పెళ్లి వాయిదా వేసుకున్న హీరోయిన్ | Priyamani Wedding postponed | Sakshi
Sakshi News home page

పెళ్లి వాయిదా వేసుకున్న హీరోయిన్

Sep 8 2015 8:22 AM | Updated on Apr 3 2019 9:13 PM

పెళ్లి వాయిదా వేసుకున్న హీరోయిన్ - Sakshi

పెళ్లి వాయిదా వేసుకున్న హీరోయిన్

నటి ప్రియమణికిప్పుడు ఓ భాషలోనూ అవకాశాలు లేవు...

నటి ప్రియమణికిప్పుడు ఓ భాషలోనూ అవకాశాలు లేవు. పెళ్లి చేసుకుని సంసార జీవితలో సెటిలవ్వాలని భావించారు. అందుకు ప్రియుడి తరపు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ పడింది. అన్నట్టు ప్రియమణి ప్రేమ కథ చెప్పలేదు కదూ. ఈ భామ ముస్తాఫారాజ్ అనే ముంబాయికి చెందిన వ్యక్తిని ప్రేమించారు. తదుపరి కథను ప్రియమణినే అడుగుదాం.

అసలు విషయం ఏమటంటే వీరి పెళ్లి వాయిదా పడింది. కారణం కొన్ని సినిమాల్లో చూసినట్లు ప్రియమణి పెళ్లి వాయిదాకు విధి తాత్కాలికంగా ఆటంకంగా నిలిసింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రియమణినే తెలిపారు. అదేమిటో ఆమె మాటల్లోనే విందాం. బెంగుళూర్‌లో జరిగిన కిక్రెట్ క్రీడా పోటీల సమయంలో ముస్తాఫారాజ్‌తో పరిచయమయ్యింది. ముందుగా ఆయనే నా ఫోన్ నంబర్ అడిగి తీసుకున్నారు.

అలా ఒకరికొకరం ఫోన్ చేసుకోవడంతో ప్రేమ మొలకెత్తింది. అయితే నేనే ముందుగా నా ప్రేమను వ్యక్తం చేశాను. దాన్ని నమ్మడానికి ముస్తాఫాకు కొన్ని నెలలే పట్టింది. ఆ తర్వాత నిజంగానే ప్రేమిస్తున్నానని తెలుసుకుని తనూ ఓకే చెప్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. అయితే నా జాతక రీత్యా ఇప్పుడే పెళ్లి చేసుకోవడం మంచిది కాదని జ్యోతిష్కుడు చెప్పారు. కొంతకాలం తర్వాత పెళ్లి చేసుకుంటే వైవిహిక జీవితంతో పాటు నట జీవితం బాగుంటుందని చెప్పడంతో పెళ్లిని వాయిదా వేసుకున్నట్లు ప్రియమణి వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement