ప్రియమణి చెపుతానన్న గుడ్‌న్యూస్‌ అదేనా..!

Priyamani Shares Some Good News On Social Media - Sakshi

గతేడాది ముస్తఫా రాజాను వివాహం చేసుకున్న నటి ప్రియమణి తల్లి కాబోతున్నారన్న వార్త సౌత్ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ విషయంపై ప్రియమణి ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. ఆమె చేసిన ఓ ట్వీట్ ఈ వార్తలకు మరింత బలాన్నీచేకూరుస్తుంది. ఇటీవల ప్రియమణి తన భర్తతో కలిసి దిగిన ఫొటోలను ట్విటర్‌లో పోస్ట్ చేసి, త్వరలో నేను, నా భర్త ముస్తఫారాజ్‌తో కలిసి ఓ ఆసక్తికరమైన, ఆనందకరమైన వార్తను వెల్లడిస్తా. వేచి ఉండండి’ అంటూ ట్వీట్ చేశారు. 

దీంతో ప్రియమణి త్వరలో తాను తల్లి కాబోతున్న విషయం ప్రకటిస్తారని భావిస్తున్నారు అభిమానులు. పెళ్లి తరువాత నటనకు దూరమైన ప్రియమణి ప్రస్తుతం బుల్లితెర మీద పలు టీవీ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఆమె భర్త ముస్తఫా రాజ్‌ ఈవెంట్ మేనేజర్‌గా బిజీగా ఉన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top