విరాటపర్వంలో ప్రియమణి

Priyamani In Rana Daggubati And Venu Udugula VirataParvam 1992 - Sakshi

నీది నాది ఒకే కథ సినిమాతో ఘన విజయం అందుకున్న యువ దర్శకుడు వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న రెండో  సినిమా విరాటపర్వం 1992. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో పీరియాడిక్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానా, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు నటీనటుల ఎంపిక కూడా జరుగుతోంది.

పొలిటికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌ ప్రియమణి కీలక పాత్రలో నటిస్తోంది. పెళ్లి తరువాత సినిమాకు దూరమైన ఈ సినిమా ఇటీవల సిరివెన్నెల సినిమాతో రీఎంట్రీకి రెడీ అవుతోంది. ఈ సినిమాతో పాటు రానా సినిమాలో కీలక పాత్రలో నటించేందుకు ప్రియమణి ఓకె చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో టబు నటిస్తోందన్న టాక్‌ వినిపిస్తోంది. మరి టబు, ప్రియమణి ఇద్దరు ఉన్నారా, లేక టబు ప్లేస్‌లోనే ప్రియమణిని తీసుకున్నారా అన్న విషయం తెలియాలంటే అఫీషియల్‌ ఎనౌన్స్‌మెంట్‌ వరకు వెయిట్ చేయాల్సిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top