విడాకులు తీసుకున్న స్టార్ డైరెక్టర్ | Priyadarshan, Lissy Lakshmi divorce | Sakshi
Sakshi News home page

విడాకులు తీసుకున్న స్టార్ డైరెక్టర్

Sep 16 2016 2:48 PM | Updated on Sep 4 2017 1:45 PM

విడాకులు తీసుకున్న స్టార్ డైరెక్టర్

విడాకులు తీసుకున్న స్టార్ డైరెక్టర్

ఇటీవల సినీ రంగంలో విడాకుల వార్తలు తరుచుగా వినిపిస్తున్నాయి. తాజాగా స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్, సీనియర్ హీరోయిన్ లిజీ లక్ష్మీలు విడాకులు తీసుకున్నారు.

ఇటీవల సినీ రంగంలో విడాకుల వార్తలు తరుచుగా వినిపిస్తున్నాయి. తాజాగా స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్, సీనియర్ హీరోయిన్ లిజీ లక్ష్మీలు విడాకులు తీసుకున్నారు. గతంలో ఈ ఇద్దరు విడాకులు తీసుకున్నట్టు చాలా సార్లు వార్తలు వినిపించాయి. శుక్రవారం ఈ విషయాన్ని లిజీ అధికారికంగా వెల్లడించింది. ఒక మీడియా ప్రకటనలో భాగంగా లిజీ లక్ష్మీ తాను ప్రియదర్శన్తో చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నానని, ఇద్దరం ఫ్యామిలీ కోర్టులో విడాకుల పత్రాలమీద సంతకం చేశామని తెలిపింది.

మలయాళ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా ఉన్న ప్రియదర్శన్, అప్పటి స్టార్ హీరోయిన్ లిజీ లక్ష్మీని 1990లో పెళ్లి చేసుకున్నారు. చాలా కాలం ఇద్దరి మధ్య వివాదం ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నా.. ఎప్పుడు బహిరంగంగా వివాదం పై మాట్లాడలేదు. గత కొంతకాలంగా ఈ ఇద్దరు విడిగానే ఉంటున్నారు.  విడాకుల తరువాత శనివారం జరగనున్న సిసిఎల్ మ్యాచ్ కోసం ఈ జంట ఒకే వేదిక మీద కనిపించే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement