Lissy Lakshmi
-
ప్రియదర్శన్ విడాకులకు, భార్యతో కలిసిపోవడానికి ఒక్కటే కారణం!
కొన్ని బంధాలు ఎప్పుడు జతకలుస్తాయో, ఎప్పుడు విడిపోతాయో అర్థం కాదు. మలయాళ స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ కెరీర్ ప్రారంభించిన కొంతకాలానికే హీరోయిన్ లిస్సీతో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ ప్రేమను పెళ్లి బంధంగా మార్చాలనుకున్నారు. 1990 డిసెంబర్ 13న వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత లిస్సీ తన పేరును లక్ష్మిగా మార్చుకుంది. అలాగే సినిమాలకు సైతం గుడ్‌బై చెప్పేసి ఇంటికే పరిమితమైపోయింది. 2016లో విడాకులుఈ దంపతులకు కుమారుడు సిద్దార్థ్, కూతురు కల్యాణి సంతానం. ప్రియదర్శన్- లిస్సీ దంపతులు ఎంతో అన్యోన్యంగానే ఉండేవారు. దాదాపు రెండు దశాబ్దాలపాటు బాగానే ఉన్న ఈ జంట తర్వాత సడన్‌గా విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అలా అని వీరిమధ్య పెద్ద గొడవలు కూడా జరిగన దాఖలాలు లేవు. 2014లో లిస్సీ ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. 2016 సెప్టెంబర్‌లో వీరికి అధికారికంగా విడాకులు మంజూరయ్యాయి. ఇటీవలే కలిసిపోయిన జంటఅప్పటినుంచి వీరు విడివిడిగానే జీవిస్తున్నారు. అయితే విచిత్రంగా పదేళ్ల తర్వాత ఇద్దరూ మళ్లీ కలిసిపోయారు. ఈ విషయాన్ని ప్రియదర్శనే స్వయంగా వెల్లడించాడు. ప్రస్తుతం కలిసే ఉంటున్నామని, కాకపోతే మళ్లీ పెళ్లి చేసుకోలేదన్నాడు. మరి అసలు ఈ జంట అప్పట్లో ఎందుకు విడిపోయింది? అన్నది చాలామంది అర్థం కాని ప్రశ్న!ఆ విషయం గురించి ప్రియదర్శన్ మాట్లాడుతూ.. పెళ్లయిన కొన్నేళ్లకు జీవితం బోరింగ్‌గా అనిపించింది. మా ఇద్దరి మధ్య ఇగో కూడా పెరిగింది. అసలు కారణమిదే!దానివల్లే పరిస్థితులు కొంత క్లిష్టంగా మారాయి. దాన్ని మరీ తెగేవరకు లాగకుండా విడిపోవడమే మంచిదని ఓ నిర్ణయానికి వచ్చాం, విడిపోయాం. కానీ కొన్నేళ్ల తర్వాత మేము ఒకరినొకరం మిస్ అయ్యాం, భాగస్వామి లేని లోటు కొట్టొచ్చినట్లు కనిపించింది. తోడు కావాలనిపించింది. అందుకే కలిసిపోయాం. అంతే..! అని సింపుల్‌గా బదులిచ్చాడు. అంటే అప్పుడు బోర్ కొట్టిందని విడిపోయారు.. ఇప్పుడు సింగిల్‌గా ఉంటే బోర్ కొడుతోందని మళ్లీ కలిసిపోయారన్నమాట!చదవండి: ఆ సమస్య వల్ల పాటలకు దూరమైన స్టార్ సింగర్ -
గౌరవప్రదంగా విడాకులు పొందలేకపోయా..
విడాకులు పొందలేక పోయామనే చింతను నటి లిజి వ్యక్తం చేశారు. కమలహాసన్‌కు జంటగా విక్రమ్ చిత్రంతో పాటు పలు భాషల్లో కథానాయకిగా నటించిన నటి లిజి. ఆమె మలయాళ దర్శకుడు ప్రియదర్శిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రియదర్శన్ తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. కాగా ప్రియదర్శిన్, లిజిలకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండు దశాబ్దాలు సంసారం చేసిన వారి మధ్య మనస్పర్థలు కలగడంతో గత ఏడాది విడాకుల కోసం చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టును ఆశ్రయించారు. అంతకు ముందు చాలా మంది శ్రేయోభిలాషులు లిజి, ప్రియదర్శిన్‌ల మధ్య సమోధ్యకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కాగా గురువారం వీరు చట్టబద్దంగా కోర్టులో విడాకులను పొందారు. దీని గురించి నటి లిజి ఒక ప్రకటనలో పేర్కొంటూ దర్శకుడు ప్రియదర్శిన్తో తన వివాహ జీవితం ఈ రోజుతో ముగిసిపోయిందన్నారు. కుటుంబ సంక్షేమ కోర్టులో న్యాయమూర్తి సమక్షంలో తామిద్దరం హాజరై విడాకుల పత్రాలను అందుకున్నామన్నారు. ఇటీవల బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్-సుస్సేన్, విజయ్-అమలాపాల్ వంటి వారు సామరస్యపూర్వకంగా చర్చించుకుని విడిపోవాలన్న నిర్ణయానికి వచ్చారన్నారు. అలాంటిది తమ విషయంలో అది అందుకు భిన్నంగా జరిగిందన్నారు. తమ మధ్య తరచూ గొడవలు జరిగాయన్నారు. ప్రస్తుతం అలాంటి వాటి నుంచి బయట పడ్డానని పేర్కొన్నారు. కఠినమైన జీవితం నుంచి ఇది వేరే విధంగా నిర్ణయం జరిగిందని, అలా గౌరవప్రదంగా విడాకులు పొందలేకపోయామని నటి లిజి అన్నారు. -
విడాకులు తీసుకున్న స్టార్ డైరెక్టర్
ఇటీవల సినీ రంగంలో విడాకుల వార్తలు తరుచుగా వినిపిస్తున్నాయి. తాజాగా స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్, సీనియర్ హీరోయిన్ లిజీ లక్ష్మీలు విడాకులు తీసుకున్నారు. గతంలో ఈ ఇద్దరు విడాకులు తీసుకున్నట్టు చాలా సార్లు వార్తలు వినిపించాయి. శుక్రవారం ఈ విషయాన్ని లిజీ అధికారికంగా వెల్లడించింది. ఒక మీడియా ప్రకటనలో భాగంగా లిజీ లక్ష్మీ తాను ప్రియదర్శన్‌తో చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నానని, ఇద్దరం ఫ్యామిలీ కోర్టులో విడాకుల పత్రాలమీద సంతకం చేశామని తెలిపింది. మలయాళ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్‌గా ఉన్న ప్రియదర్శన్, అప్పటి స్టార్ హీరోయిన్ లిజీ లక్ష్మీని 1990లో పెళ్లి చేసుకున్నారు. చాలా కాలం ఇద్దరి మధ్య వివాదం ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నా.. ఎప్పుడు బహిరంగంగా వివాదం పై మాట్లాడలేదు. గత కొంతకాలంగా ఈ ఇద్దరు విడిగానే ఉంటున్నారు. విడాకుల తరువాత శనివారం జరగనున్న సిసిఎల్ మ్యాచ్ కోసం ఈ జంట ఒకే వేదిక మీద కనిపించే అవకాశం ఉంది.


