నాని సినిమాలో సెన్సేషనల్‌ బ్యూటీ..! | Priya Prakash Varrier Being Considered for Nani And Vikram Kumar Film | Sakshi
Sakshi News home page

Jan 27 2019 1:11 PM | Updated on Jan 27 2019 1:11 PM

Priya Prakash Varrier Being Considered for Nani And Vikram Kumar Film - Sakshi

ఇటీవల సక్సెస్‌ విషయంలో కాస్త తడబడుతున్న యంగ్ హీరో నాని వరుసగా రెండు సినిమాలను లైన్‌లో పెట్టాడు. ఇప్పటికే గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో జెర్సీ సినిమాలో నటిస్తున్న నాని, తరువాత విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్‌ పోస్టర్‌ను కూడా రిలీజ్‌ చేశారు.

తాజాగా నాని, విక్రమ్‌ల సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్‌ టాలీవుడ్లో హల్‌చల్‌ చేస్తోంది. ఇటీవల ఒక్క కంటి సైగతో సోషల్ మీడియాను ఊపేసిన బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించనుందట. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement