ఆడియన్స్‌ చప్పట్లు కొడతారు | prementha panichese narayana october 5 release | Sakshi
Sakshi News home page

ఆడియన్స్‌ చప్పట్లు కొడతారు

Sep 23 2018 1:41 AM | Updated on Sep 23 2018 1:41 AM

prementha panichese narayana october 5 release - Sakshi

సావిత్రి, హరికృష్ణ, శ్రీనివాసరావు, అక్షిత

‘ప్రేమెంత పనిచేసే నారాయణ’ అనే పాట ఎంత ఫేమస్సో అందరికీ తెలుసు. ఇప్పుడు అదే టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కింది. హరికృష్ణ జొన్నలగడ్డ, అక్షిత జంటగా నటించారు. భాగ్యలక్ష్మీ సమర్పణలో జె.ఆర్‌.యస్‌ మూవీస్‌ పతాకంపై జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సావిత్రి జొన్నలగడ్డ నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్‌ 5న రిలీజ్‌ కానుంది. జొన్నలగడ్డ శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘దర్శకునిగా నాకిది తొమ్మిదో చిత్రం. పెద్ద హీరోలతో సినిమాలు చేశాను.

ఈ కథ వైవిధ్యంగా ఉండటంతో నా కుమారుడిని హీరోగా పరిచయం చేస్తున్నాను. ఇలాంటి పాయింట్‌ ఇంతవరకూ ఏ డైరెక్టర్‌ టచ్‌ చేయలేదు. క్లైమాక్స్‌ సీన్స్‌కు ప్రేక్షకులు ఖచ్చితంగా క్లాప్స్‌ కొడతారు’’ అన్నారు. ‘‘అన్ని జనరేషన్స్‌కు కనెక్ట్‌ అయ్యే ప్రేమ కథ ఇది. సినిమా చూస్తున్నంత సేపు ఓ కొత్త కథను చూస్తున్నామనే ఫీలింగ్‌ కలుగుతుంది. ప్రేమలో బాధను ఈ సినిమా తెలియచేస్తుంది. ప్రేమికులైతే ఇలాంటి అనుభవాలు మన జీవితంలో కూడా ఉన్నాయనుకుంటారు. కథలో చాలా ట్విస్టులుంటాయి. తప్పకుండా  విజయం సాధిస్తాం’’ అన్నారు హీరో హరికృష్ణ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement