సినిమాలు తప్ప వేరే ప్రపంచం తెలీదు | Prementha Panichese Narayana Movie Press Meet | Sakshi
Sakshi News home page

సినిమాలు తప్ప వేరే ప్రపంచం తెలీదు

Feb 18 2019 12:38 AM | Updated on Feb 18 2019 12:38 AM

Prementha Panichese Narayana Movie Press Meet - Sakshi

అక్షిత, హరికృష్ణ, శ్రీకాంత్, జొన్నలగడ్డ శ్రీనివాసరావు

దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు తనయుడు హరికృష్ణ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘ప్రేమెంత పనిచేసె నారాయణ’. అక్షిత కథానాయికగా నటించారు. ఝాన్సీ కీలక పాత్ర చేశారు. జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో సావిత్రి జొన్నలగడ్డ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ–రిలీజ్‌ వేడుకలో ముఖ్య అతిథిగా వచ్చిన నటుడు శ్రీకాంత్‌ ఈ సినిమా సంగీత దర్శకుడు యాజమాన్యకు తొలి జ్ఞాపికను అందజేశారు. అనంతరం శ్రీకాంత్‌ మాట్లాడుతూ– ‘‘శ్రీనివాసరావుకు సినిమాలు తప్ప వేరే ప్రపంచం తెలీదు.

ఆయన తనయుడు హరిని హీరోగా పరిచయం చేస్తూ, తనే ఈ సినిమా అన్ని బాధ్యతలను తీసుకుని శ్రమించారు. హరి బాగా హార్డ్‌వర్క్‌ చేస్తాడు. భవిష్యత్‌లో స్టార్‌ అవుతాడు’’ అన్నారు. ‘‘కథను నమ్మి చేసిన చిత్రమిది. ఈ కథకి కొందరు ఇచ్చిన సలహాలు నచ్చలేదు.. అందుకే నేను తీయాలనుకున్నది తీసాను. హిందీ డబ్బింగ్‌ రైట్స్‌కు కూడా మంచి ధర దక్కింది. ఈ సినిమాకు ఎంతో సపోర్ట్‌ చేస్తున్న నిర్మాత అల్లు అరవింద్‌గారి సహకారం మర్చిపోలేనిది’’ అన్నారు జొన్నలగడ్డ శ్రీనివాసరావు. ‘‘ప్రేమకు కొత్త అర్థం చెప్పే చిత్రమిది. స్నేహం విలువను చాటిచెప్పే కథ’’ అన్నారు హరికృష్ణ. రచయిత మరుదూరి రాజా, నటుడు కాశీవిశ్వనాథ్, హీరోయిన్‌ అక్షిత మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement