నవ్వు.. భయం.. ఖాయం | Prema Katha Chitram 2 Movie Opening | Sakshi
Sakshi News home page

నవ్వు.. భయం.. ఖాయం

May 11 2018 1:04 AM | Updated on May 11 2018 1:04 AM

Prema Katha Chitram 2 Movie Opening - Sakshi

‘ప్రేమకథా చిత్రమ్, జక్కన్న’ వంటి హిట్స్‌ అందించిన ఆర్‌పీఏ క్రియేషన్స్‌ ప్రస్తుతం ‘ప్రేమకథా చిత్రమ్‌ 2’ రూపొందించనుంది. ‘బ్యాక్‌ టు ఫియర్‌’ అన్నది క్యాప్షన్‌. సుమంత్‌ అశ్విన్‌ హీరోగా హరికిషన్‌ దర్శకత్వంలో ఆర్‌. సుదర్శన్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ క్లాప్‌ ఇవ్వగా, అమరేందర్‌ రెడ్డి కెమెరా స్విచ్చాన్‌ చేశారు. అఖిల్‌ రెడ్డి తొలి సన్నివేశానికి డైరెక్షన్‌ చేశారు. సుదర్శన్‌ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ప్రేమకథా చిత్రమ్‌’ హిలేరియస్‌ కామెడీతో ట్రెండ్‌ క్రియేట్‌ చేసింది.

ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘ప్రేమకథా చిత్రమ్‌ 2’ ప్రారంభించాం. హరికిషన్‌ను దర్శకునిగా పరిచయం చేస్తున్నాం. కామెడీ ఎంటర్‌టైనర్‌గా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే కథ ఇది. మా బ్యానర్‌లో మరో సూపర్‌ హిట్‌ చిత్రంగా నిలుస్తుందని నమ్ముతున్నాం. కెమెరామెన్‌ సి.రాంప్రసాద్, ఎడిటర్‌ ఉద్ధవ్, సంగీత దర్శకుడు జేబీ, డైలాగ్‌ రైటర్‌ చంద్రశేఖర్‌ లాంటి టెక్నీషియన్స్‌ మెయిన్‌ పిల్లర్స్‌గా ఈ సినిమా రూపొందిస్తున్నాం. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: ఆయుష్‌ రెడ్డి, ఆర్‌.పి. అక్షిత్‌ రెడ్డి.

Advertisement
 
Advertisement
Advertisement