బాలీవుడ్ భామలు కోలీవుడ్‌పై కన్నేయడం కొత్తేమీ కాదు. ఇంతకుముందు కుష్భు, సిమ్రాన్ వంటి ఉత్తరాది భామలు దక్షిణాదిలో హీరోయిన్లుగా మంచి క్రేజ్ పొందారు.

బాలీవుడ్ భామలు కోలీవుడ్‌పై కన్నేయడం కొత్తేమీ కాదు. ఇంతకుముందు కుష్భు, సిమ్రాన్ వంటి ఉత్తరాది భామలు దక్షిణాదిలో హీరోయిన్లుగా మంచి క్రేజ్ పొందారు. తాజాగా మరో బాలీవుడ్ బ్యూటీ ప్రీతిదాస్ కోలీవుడ్‌లో పాగా వేయడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈమె ఇప్పటికే మరముగం, ఉయిరుక్కు ఉయిరాగ చిత్రాలతో కోలీవుడ్‌లోకి వచ్చింది. ఇక్కడే నటిగా రాణించాలన్నది తన కోరికని అంటోంది ప్రీతిదాస్. ఉత్తరాది నుంచి వచ్చిన కుష్భు, సిమ్రాన్‌లను ప్రేరణగా తీసుకుని తన నటనా ప్రతిభను చాటుకోవాలని అనుకుంటున్నానని పేర్కొంది.
గ్లామరస్ పాత్రల గురించి అభిప్రాయమేమిటన్న ప్రశ్నకు తన తొలి చిత్రం మరుముగం చిత్రంలోనే అందాలు ఆరబోశానని, పాత్ర డిమాండ్ మేరకు గ్లామర్‌గా నటించడానికి సిద్ధమని తెలిపింది. ఈ రంగంలోకి వచ్చే ముందు ఎవరైనా సూచనలు, సలహాలు ఇచ్చారా? అని అడిగితే నటి శ్రీయ నుంచి చాలా సలహాలు పొందానని వెల్లడించింది. కథా బలం ఉన్న పాత్రల్లో నటించాలని ఉందన్నారు. నటుడు అజిత్ అంటే చాలా ఇష్టమని, ఆయనతో రొమాన్స్ చేయాలని ఆశిస్తున్నట్లు పేర్కొంది. అలాంటి అవకాశం వస్తే ఇతర ఛాన్స్‌లన్నీ పక్కన పెట్టి అజిత్‌తో నటిస్తానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నటిస్తున్న ఉయిరుక్కు ఉయిరాగ చిత్రం త్వరలో తెరపైకి రానుందని, ఈ చిత్రం కెరీర్‌ను మంచి మలుపు తిప్పుతుందని ప్రీతిదాస్ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.