ఆలోచింపజేసే ప్రతినిధి | Prathinidhi platinum disc function held | Sakshi
Sakshi News home page

ఆలోచింపజేసే ప్రతినిధి

Apr 19 2014 11:54 PM | Updated on Aug 29 2018 3:53 PM

ఆలోచింపజేసే ప్రతినిధి - Sakshi

ఆలోచింపజేసే ప్రతినిధి

నారా రోహిత్ కథానాయకునిగా రూపొందిన చిత్రం ‘ప్రతినిధి’. శుభ్ర అయ్యప్ప కథానాయిక. ప్రశాంత్ మండవ దర్శకత్వంలో జె.సాంబశివరావు ఈ చిత్రాన్ని నిర్మించారు.

నారా రోహిత్ కథానాయకునిగా రూపొందిన చిత్రం ‘ప్రతినిధి’. శుభ్ర అయ్యప్ప కథానాయిక. ప్రశాంత్ మండవ దర్శకత్వంలో జె.సాంబశివరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. గుమ్మడి రవీంద్రబాబు సమర్పిస్తున్న ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. సాయికార్తీక్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. అందరినీ ఆలోచింపజేసే సినిమా ఇదని, సరైన సమయంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని, సంగీతం ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్ అని నారా రోహిత్ అన్నారు. సినిమా బాగా వచ్చిందని, జనాదరణ పొందుతుందనే నమ్మకం ఉందని దర్శకుడు చెప్పారు. చక్కని కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కిందని దర్శకుడు అన్నారు. అతిథులుగా విచ్చేసిన పోకూరి బాబూరావు, ఆర్.నారాయణమూర్తి, తమ్మారెడ్డి భరద్వాజ్, నాని, భీమినేని శ్రీనివాసరావు సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులు మాట్లాడారు.
 

Advertisement
 
Advertisement
Advertisement