అమెరికాలో పండగ | Prathi Roju Pandage next schedule in America | Sakshi
Sakshi News home page

అమెరికాలో పండగ

Oct 15 2019 12:22 AM | Updated on Oct 15 2019 12:22 AM

Prathi Roju Pandage next schedule in America - Sakshi

సాయి తేజ్, సత్యరాజ్‌

‘సుప్రీమ్‌’ వంటి హిట్‌ చిత్రం తర్వాత సాయితేజ్‌–రాశీఖన్నా కలిసి నటిస్తున్న చిత్రం ‘ప్రతిరోజు పండగే’. మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్ని’ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుపుకుంటోంది. ఆ తర్వాతి షెడ్యూల్‌ని అమెరికాలో చిత్రీకరించనున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘సాయితేజ్‌ను కొత్తగా చూపించబోతున్నారు మారుతి. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే కుటుంబ బంధాల్ని, విలువల్ని భావోద్వేగంగా చిత్రీకరిస్తున్నారు.

మారుతి చిత్రాల్లో సహజంగా కనిపించే ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇందులో రెండు రెట్లు ఎక్కువగానే ఉంటుంది. సాయితేజ్, నటుడు సత్యరాజ్‌ ఫస్ట్‌లుక్‌కి అద్భుతమైన స్పందన లభించింది. సత్యరాజ్‌ క్యారెక్టర్‌ని ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు మారుతి. రావు రమేశ్‌ పాత్ర కూడా సినిమాకి హైలెట్‌గా ఉంటుంది. నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న మా హీరో సాయి తేజ్‌కి జన్మదిన శుభాకాంక్షలు’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: ఎస్‌.కె.ఎన్, సంగీతం: తమన్,  కెమెరా: జయకుమార్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: బాబు.

Advertisement
 
Advertisement
Advertisement