ప్రకాష్ రాజ్ మళ్లీ తండ్రయ్యాడు | Prakash Raj Turns A Father Again @ 50 | Sakshi
Sakshi News home page

ప్రకాష్ రాజ్ మళ్లీ తండ్రయ్యాడు

Feb 3 2016 12:27 PM | Updated on Sep 3 2017 4:53 PM

ప్రకాష్ రాజ్  మళ్లీ తండ్రయ్యాడు

ప్రకాష్ రాజ్ మళ్లీ తండ్రయ్యాడు

టాలెంటెడ్ క్యారెక్టర్ యాక్టర్ ప్రకాష్ రాజ్ సంతోషంలో మునిగితేలుతున్నాడు. ఎందుకంటే 50 ఏళ్ల వయసులో ఆయన మళ్లీ తండ్రియ్యాడు

హైదరాబాద్:  టాలెంటెడ్ క్యారెక్టర్  యాక్టర్  ప్రకాష్ రాజ్ సంతోషంలో మునిగితేలుతున్నాడు.  ఎందుకంటే 50 ఏళ్ల వయసులో ఆయన మళ్లీ  తండ్రియ్యాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు.  తమకు బాబు పుట్టాడని.. తమ జీవితాల్లో ఆనందకరమైన ఈ క్షణాలను మీతో పంచుకోవాలనుకుంటున్నామంటూ  ట్విట్టర్ లో ఈ  శుభవార్తను అందించాడు.  భార్య పోనీ, తాను చాలా సంతోషంగా ఉన్నామన్నామని తెలిపాడు.  తమ  బిడ్డను ఆశీర్వదించండి అంటూ ట్విట్ చేశాడు.  దీంతో సినీరంగానికి చెందిన  ప్రముఖులు, ఇతర సెలబ్రిటీలు ప్రకాష్ రాజ్ దంపతులను అభినందనలతో ముంచెత్తారు.
 

మొదటి భార్య లలితతో  విడిపోయిన అనంతరం  పోనీ వర్మను ప్రకాష్ రాజ్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కాగా లలిత, ప్రకాష్ రాజ్ దంపతులకు ఇద్దరు  కూతుళ్లు కాగా, 2004లో గాలిపటం ప్రమాదంలో  అయిదేళ్ల కొడుకును  పోగొట్టుకోవడం ప్రకాష్  రాజ్ జీవితంలో  పెద్ద విషాదంగా మిగిలింది.  ఈ నేపథ్యంలోనే లలిత, ప్రకాష్ రాజ్ ల మధ్య విభేదాలు ఏర్పడి...చివరికి విడాకులకు దారి తీసినట్లు సమాచారం.  ఇపుడు ఈ బాబు రూపంలో మళ్లీ  ఆయన జీవితంలో కొత్త సంతోషాలను మోసుకొచ్చాడనే  చెప్పాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement