‘ప్రదీప్‌’ పాటకు నెటిజన్లు ఫిదా | Pradeeps 30 Rojullo Preminchadam Ela Telugu Movie First Song Viral | Sakshi
Sakshi News home page

ఆకంటుకుంటోన్న ప్రదీప్‌ మాచిరాజు సాంగ్‌

Feb 2 2020 11:31 AM | Updated on Feb 2 2020 12:01 PM

Pradeeps 30 Rojullo Preminchadam Ela Telugu Movie First Song Viral - Sakshi

ప్రదీప్‌ మాచిరాజు, అమ్రిత జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’. ఎస్వీ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై ఎస్వీ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మున్నా దర్శకత్వం వహిస్తున్నాడు. యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న ప్రదీప్‌ హీరోగా ఈ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. యూత్‌లో ముఖ్యంగా అమ్మాయిల్లో మంచి పాలోయింగ్‌ ఉన్న ఈ యాంకర్‌ తన తొలి సినిమా కోసం ప్యూర్‌ లవ్‌ స్టోరీని ఎంచుకున్నాడు. దీనికి తగ్గట్టు ఈ సినిమాకు డిఫరెంట్‌ టైటిల్‌ ప్రకటించడంతో సినిమాపై పాజిటీవ్‌ బజ్‌ క్రియేట్‌ అయింది. అంతేకాకుండా చిత్ర ఫస్ట్‌ లుక్‌ ఆకట్టుకనే విధంగా ఉంది. తాజాగా మూవీ ఫస్ట్‌ సాంగ్‌ను టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఈ సాంగ్‌ నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. ‘​నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా.. మబ్బులు నిన్నే కమ్మెస్తాయని మానేస్తున్నా’అంటూ ప్రేయసికి కానుకగా ఏమి ఇవ్వాలో తెలియక గందరగోళంలో ఉన్న ఓ ప్రేమికుడి మనసులోని భావాలను అద్భుతమైన పాటగా తీర్చిదిద్ది విడుదల చేశారు. ప్రేమ పాటల ఎక్స్‌పర్ట్‌ అనూప్‌ రుబెన్స్‌ ఈ పాటను కంపోజ్‌ చేయగా.. చాలా కాలంగా వెండితెరపై పేరు కనిపించని చంద్రబోస్‌ ఈ పాటకు హృదయానికి హత్తుకునే లిరిక్స్‌ అందించాడు. సిద్‌ శ్రీరామ్‌, సునీతలు తమ గాత్రంతో ఈ పాటకు ఊపిరి పోశారు. ప్రస్తుతం ఈ పాట ప్రేమికులకు చాలా బాగా కనెక్ట్‌ అయింది. దీంతో ప్రతీ ప్రేమికుడు తన ప్రేయసికి ఈ పాటను కానుకగా అందిస్తున్నాడు.

ఈ పాటలోని కొన్ని పదాలు మచ్చుకకు మీకోసం..
‘నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా.. మబ్బులు నిన్నే కమ్మెస్తాయని మానేస్తున్నా, నెలవంకను ఇద్దామనుకున్నా.. నీ నవ్వుకు సరిపోదంటున్నా, నువ్వు వదిలేటి శ్వాసకే గాలులు బ్రతికాయి చూడవే, ఇంత గొప్ప అందగత్తెకు ఏమి ఇవ్వనే.., నల్ల మబ్బులా మెరిసే కళ్లు నీవిలే.. ఆ కళ్లకు కాటుక ఎందుకెట్టాలె, ఏదో ఇవ్వాలి కానుక.. ఎంతో వెతికాను ఆశగా.. ఏదీ నీసాటి రాదిక అంటూ ఓడాను పూర్తిగా కనుకే ప్రాణమంత తాళి చేసి నీకు కట్టనా?’అనే లిరిక్స్‌ వావ్‌ అనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ పాట మూడు మిలియన్‌ వ్యూస్‌కు పైగా సొంతం చేసుకుని యూట్యూబ్‌లో తెగ ట్రెండ్‌ అవుతోంది.  

చదవండి:
అమీ.. ఏమాత్రం తగ్గడం లేదుగా!

‘అమలాపాల్‌-విజయ్‌ విడిపోడానికి ధనుషే కారణం!’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement