ప్రభుదేవా డైరెక్షన్లో కార్తీ | Prabhudeva to Direct Kaarthi | Sakshi
Sakshi News home page

ప్రభుదేవా డైరెక్షన్లో కార్తీ

Mar 5 2016 6:20 PM | Updated on Sep 3 2017 7:04 PM

ప్రభుదేవా డైరెక్షన్లో కార్తీ

ప్రభుదేవా డైరెక్షన్లో కార్తీ

కొరియోగ్రాఫర్గా, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా కూడా సక్సెస్ సాధించిన సౌత్ స్టార్ ప్రభుదేవా. కొరియోగ్రాఫర్గా కెరీర్ ప్రారంభించిన ప్రభుదేవా తరువాత నటుడిగా ఆ తరువాత దర్శకుడిగా సౌత్లో...

కొరియోగ్రాఫర్గా, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా కూడా సక్సెస్ సాధించిన సౌత్ స్టార్ ప్రభుదేవా. కొరియోగ్రాఫర్గా కెరీర్ ప్రారంభించిన ప్రభుదేవా.. తర్వాత నటుడిగా, ఆ తరువాత దర్శకుడిగా దక్షిణాదిలో ఆకట్టుకున్నాడు. అదే జోష్లో బాలీవుడ్లో అడుగుపెట్టిన ప్రభు, రీమేక్ సినిమాలతో టాప్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఇటీవల కాలంలో ప్రభుదేవా డైరెక్ట్ చేసిన హిందీ సినిమాలు ఆశించిన స్ధాయిలో విజయం సాధించలేకపోయాయి.

దీంతో తిరిగి సౌత్ బాట పట్టిన ప్రభుదేవా మరోసారి ఇక్కడే తనను తాను రుజువు చేసుకోడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఓ సౌత్ సినిమాలో హీరోగా నటిస్తున్న ప్రభుదేవా, దర్శకుడిగా కూడా సౌత్ సినిమానే ఎంపిక చేసుకున్నాడు. తమిళ యంగ్ హీరో కార్తీ హీరోగా ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే కార్తీకి కథ కూడా వినిపించిన ప్రభుదేవా త్వరలోనే ఆ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement