పెళ్లి కబురు చెబుతారా?

prabhas wedding announcement on october 13 - Sakshi

ప్రభాస్‌ పెళ్లి కుదిరింది. ఓ ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెను పెళ్లాడనున్నారు అనే వార్త ఎప్పటినుంచో వినిపిస్తోంది. ఇప్పుడు ఓ కొత్త వార్త తెరమీదకు వచ్చింది. అదేంటంటే.. ఈ ఏడాది తన పుట్టినరోజు నాడు ప్రభాస్‌ పెళ్లి కబురు చెప్పబోతున్నారట. అప్పట్లో అంటే..‘బాహుబలి’ టైమ్‌లో ప్రభాస్‌కు 6 వేల పెళ్లిసంబంధాలు వచ్చాయన్న వార్తలు కూడా వచ్చాయి. అలాగే ‘బాహుబలి’ సినిమా విడుదల తర్వాత ప్రభాస్‌కు ఎంతటి స్టార్‌డమ్‌ వచ్చిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

ఆ సినిమా తర్వాత పెళ్లి చేసుకుంటానని ప్రభాస్‌ పలు సందర్భాల్లో చెప్పారు కూడా. అయితే, సినిమా వచ్చింది.. వెళ్లింది. ప్రభాస్‌ పెళ్లి కబురు మాత్రం చెప్పలేదు. ఈ ఆరడుగుల అందగాడు ఎవరింటి అల్లుడు అవుతాడో.. ఏ అమ్మాయితో పెళ్లి పీటల మీద కూర్చోబోతున్నాడో అక్టోబర్‌ 23న తెలిసే అవకాశం ఉందట. ఆ రోజు ప్రభాస్‌ బర్త్‌డే. అలాగే ‘సాహో’ సెకండ్‌ టీజర్‌ కూడా బర్త్‌డే సందర్భంగా అక్టోబర్‌ 23నే వస్తుందన్న ఊహగానాలు ఉన్నాయి. ‘సాహో’ కాకుండా ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాతో ప్రభాస్‌ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top