ఇన్‌స్టాగ్రామములో అడుగుపెట్టారు | Prabhas breaks the internet with first ever Instagram post | Sakshi
Sakshi News home page

ఇన్‌స్టాగ్రామములో అడుగుపెట్టారు

Apr 19 2019 12:36 AM | Updated on Apr 19 2019 12:36 AM

Prabhas breaks the internet with first ever Instagram post - Sakshi

ప్రభాస్‌

ఏంటీ.. డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లోకి ‘ఇన్‌స్టా గ్రామము’ అనే కొత్త యాప్‌ వచ్చిందనుకుంటున్నారా? అదేం లేదు. ఇన్‌స్టాగ్రామ్‌నే సరదాగా ఇన్‌స్టాగ్రామము అన్నాం. రీసెంట్‌గానే ప్రభాస్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అకౌంట్‌ క్రియేట్‌ చేసిన నాలుగైదు రోజులకు కూడా అప్‌డేట్స్‌ ఏం పోస్ట్‌ చేయలేదు ప్రభాస్‌. ‘సాహో’కు సంబంధించిన అప్‌డేట్‌ను ఏదైనా పోస్ట్‌ చేస్తారని ఫ్యాన్స్‌ అందరూ ఊహించారు. కానీ ప్రభాస్‌ ‘బాహుబలి2’లో ఓ స్టిల్‌ను పోస్ట్‌ చేశారు. ఇది ఫ్యాన్స్‌ను కొద్దిమేరకు నిరుత్సాహపరిచినా రాబోయే అప్‌డేట్స్‌ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తారని ఊహించవచ్చు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రభాస్‌ను సుమారు 90 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఆయన నటిస్తున్న ‘సాహో’ ఆగస్ట్‌ 15న విడుదలకు సిద్ధం అవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement