ప్రభాస్తో కరణ్ భారీ డీల్..? | Prabhas And Karan Johar Enter Into Agreement | Sakshi
Sakshi News home page

ప్రభాస్తో కరణ్ భారీ డీల్..?

Jun 22 2017 10:54 AM | Updated on Sep 5 2017 2:14 PM

ప్రభాస్తో కరణ్ భారీ డీల్..?

ప్రభాస్తో కరణ్ భారీ డీల్..?

బాహుబలి సినిమాతో ప్రభాస్ జాతీయ స్థాయి నటుడిగా ఎదిగాడు. తొలి భాగం రిలీజ్ అయిన తరువాత పలు బాలీవుడ్

బాహుబలి సినిమాతో ప్రభాస్ జాతీయ స్థాయి నటుడిగా ఎదిగాడు. తొలి భాగం రిలీజ్ అయిన తరువాత పలు బాలీవుడ్ సినిమాల్లో ప్రభాస్కు ఆఫర్లు వచ్చాయి. అయితే బాహుబలి పూర్తయితే గాని ఇతర సినిమాలు అంగీకరించకూడదని నిర్ణయం తీసుకున్న ప్రభాస్, అన్నింటిని రిజెక్ట్ చేశాడు. రెండో భాగం రిలీజ్ తరువాత ప్రభాస్ రేంజ్ మరింతగా పెరిగిపోయింది. ముఖ్యంగా బాలీవుడ్లో బాహుబలి 2 సృష్టిస్తున్న సంచలనాలతో అక్కడి నిర్మాతలు కూడా ప్రభాస్ డేట్స్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు.

అదే సమయంలో బాహుబలి సినిమాకు బాలీవుడ్ సమర్పకుడిగా వ్యవహరించిన కరణ్ జోహర్, ప్రభాస్తో స్ట్రయిట్ బాలీవుడ్ సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. ఒకేసారి రెండు, మూడు సినిమాలకు అగ్రిమెంట్ చేసుకునేలా ప్రభాస్తో చర్చలు జరుపుతున్నాడట. గతంలో బాహుబలి 2 సక్సెస్ పార్టీ ఇచ్చాడు కరణ్. కానీ ఆ సమయంలో ప్రభాస్ విదేశాల్లో ఉండటంతో ఆ పార్టీలో పాల్గొనలేదు.  అందుకే ఇటీవల ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఓ పార్టీ ఇచ్చాడు కరణ్. ఈ పార్టీలోనే ప్రభాస్తో వరుసగా సినిమాలు చేసేందుకు చర్చించాడట. ప్రభాస్ కూడా కరణ్తో డీల్కు సుముఖంగానే ఉన్నాడన్న టాక్ వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement