'కాటం రాయుడా'కు పవర్ 'స్టార్' క్లిక్స్ | power star clicks for katam raidu song | Sakshi
Sakshi News home page

'కాటం రాయుడా'కు పవర్ 'స్టార్' క్లిక్స్

Aug 5 2013 4:21 PM | Updated on Jul 6 2019 3:48 PM

'కాటం రాయుడా'కు పవర్ 'స్టార్' క్లిక్స్ - Sakshi

'కాటం రాయుడా'కు పవర్ 'స్టార్' క్లిక్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన గళం విప్పాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన గళం విప్పాడు. తమ్ముడు, ఖుషి చిత్రాల్లో జానపద గీతాలు పాడిన అతను తన తాజా చిత్రం 'అత్తారింటికి దారేది'లో ఓ పాట పాడాడు. అలనాటి చిత్రం 'సుమంగళి'లోని 'కాటం రాయుడా' పాటను ఆలపించాడు. ఈ పాట ప్రస్తుతం యుట్యూబ్లో హల్ చల్ చేస్తోంది. కేవలం 24 గంటల్లో 3,70,000 మంది ఈ వీడియోని వీక్షించారు. ఈ పాటను పవన్ ఈజీగా .... అరగంటలో పాడేశాడట.

అయితే చిత్ర యూనిట్ ఆడియో విడుదల చేసేటప్పుడు మాత్రం ఈ పాట గురించి  గోప్యంగా ఉంచారు. ప్రేక్షకులను, అభిమానులను ఆశ్చర్యంలో ముంచేందుకు ఈ పాటను ఇటీవల విడుదల చేసిన ఆడియో ఆల్బంలో పెట్టలేదు. ఇదే విషయాన్ని ఆడియో రిలీజ్ రోజు హాస్య నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ ఈ సినిమాలో ఇంకో పాట ఉందని.. అది బయటపెడితే తనను చంపేస్తానన్నారని చెప్పిన విషయం తెలిసిందే.

'అత్తారింటికి దారేది'లో పవన్ సరసన సమంత...ప్రణీత హీరోయిన్లుగా నటించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చాడు. బీవీఎస్ఎస్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఈనెల 9న 'అత్తారింటికి దారేదీ' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో హీరో మహేష్ బాబు కూడా ఓ అతిథి పాత్ర పోషించారు. ఓ పక్క పవన్ పాటతో పాటు, ప్రిన్స్ గెస్ట్ రోల్ చూసేందుకు ఇద్దరు హీరోల అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement