‘మహేష్ బాబూ.. నేను ఆడపిల్లగా పుడితే’

Posani Krishna Murali Funny Speech at Maharshi Movie Success Meet - Sakshi

మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కిన మహర్షి సినిమా ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. డివైడ్‌ వచ్చినా ఈ సినిమా వసూళ్లు పరంగా మాత్రం సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతోంది. ఈసందర్భంగా చిత్రయూనిట్ సక్సెస్‌ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మహేష్ తో పాటు అల్లరి నరేష్‌, ఇతర నటీనటులు దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాతలు దిల్ రాజు, అశ్వనీదత్‌లు, ఇతర సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ.. దర్శకుడు వంశీ పైడిపల్లి టేకింగ్ హాలీవుడ్ స్థాయిలో ఉంటుందంటూ కితాబిచ్చారు. నేనే గనక ఆడపిల్లనైతే మహేష్‌ బాబు పెళ్లి చేసుకునే వరకు వదిలిపెట్టే వాడిని కాదంటూ నవ్వులు పూయించారు. మహేష్ అందం చూస్తే మొగాళ్లకు అసూయ కలుగుతుందంటూ ఆకాశానికెత్తేశారు. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందించాడు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top