ప్రముఖ విలన్‌ అనుమానాస్పద మృతి | Popular Aactor Mahesh Anand Passes Away | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌ విలన్‌ మహేష్ ఆనంద్‌ మృతి

Feb 10 2019 11:29 AM | Updated on Apr 3 2019 6:34 PM

Popular Aactor Mahesh Anand Passes Away - Sakshi

నార్త్‌ తో పాటు సౌత్‌లోనూ స్టార్ హీరోలకు ప్రతినాయకుడిగా నటించిన మహేష్ ఆనంద్‌(57) అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. శనివారం ఆయన ఇంటిలో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు మృతికి కారణాలు తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. పోలీసులు వచ్చేటప్పటికే మృతదేహం కుళ్లిపోయి ఉండటంతో ఆయన మరణించి రెండు రోజులు అయి ఉంటుందని భావిస్తున్నారు.

ఇంట్లో సూసైడ్‌ నోట్‌ లభించకపోవటంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆయన భార్య మాస్కోలో ఉండటంతో పశ్చిమ అందేరిలోని యారి రోడ్‌లో మహేష్ ఆనంద్‌ ఒంటరిగా ఉంటున్నారు. ఆయన చివరిసారిగా గోవింద హీరోగా నటించిన రంగేలీ రాజా సినిమాలో కనిపించారు. తెలుగులో నెంబర్‌ వన్‌, టాప్‌ హీరో, బాలు లాంటి సినిమాల్లో నటించారు మహేష్‌ ఆనంద్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement