వావ్‌.. పూజా భలే చేసిందే! | Pooja Hegde Workout Video Goes Viral | Sakshi
Sakshi News home page

Feb 12 2019 2:53 PM | Updated on Apr 7 2019 12:28 PM

Pooja Hegde Workout Video Goes Viral - Sakshi

ఈ మధ్య హీరోయిన్లు జిమ్‌లో వర్కౌట్లు చేస్తూ.. జిమ్నాస్టిక్స్‌ చేస్తూ.. ఆ వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. రకుల్‌, సమంత, పూజా హెగ్డె లాంటి హీరోయిన్లు నిత్యం ఫిట్‌నెస్‌ను పాటిస్తూ.. జిమ్‌లో బిజీబిజీగా ఉంటున్నారు. తాజాగా పూజా హెగ్డె ఓ ఫీట్‌ను చేసి.. దానికి సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో వదిలింది. కొద్దిసేపట్లోనే అది కాస్త వైరల్‌ అయింది. 

పూజా హెగ్డె తన శరీరాన్ని విల్లులా వెనక్కి వంచింది. చెప్పడానికి ఈజీగానే ఉన్నా.. చేయడానికి మాత్రం చాలా కష్టమే. ఏముందిలే ఎవరైనా చేసేయొచ్చులే.. అని ట్రై చేస్తే మాత్రం నడ్డి విరగడం ఖాయం. కానీ పూజా మాత్రం ఈ ఫీట్‌ను అలవోకగా చేసేసి.. ‘ఈ వీడియోను ఇక్కడ పోస్ట్ చేసేందుకు అర్హత కలిగినదే’. అంటూ క్యాప్షన్‌ పెట్టింది. వావ్‌ అమేజింగ్‌.. ఫిట్‌నెస్‌ గురూ.. అంటూ నెటిజన్ల కామెంట్లతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. పూజా హెగ్డే ప్రస్తుతం ‘మహర్షి’ షూటింగ్‌తో బిజీగా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement