అప్పుడు ఏడ్చేస్తా | Pooja Hegde on how Mohenjo Daro failure affected her | Sakshi
Sakshi News home page

అప్పుడు ఏడ్చేస్తా

Apr 29 2018 12:31 AM | Updated on Aug 22 2019 9:35 AM

Pooja Hegde on how Mohenjo Daro failure affected her - Sakshi

పూజా హెగ్డే

‘‘ఏ ప్రయాణంలో అయినా గెలుపోటములు సహజం.  ఈ రెంటినీ సమానంగా తీసుకుంటేనే ముందుకు వెళ్లగలం. కానీ ఈ రెండు విషయాల్ని అందరూ ఒకేలా తీసుకోవాలనే రూలు లేదు. నా విషయానికి వస్తే.. ఏదైనా ఫెయిల్యూర్‌ వస్తే పదిహేను నిమిషాలు ఏడ్చేస్తాను’’ అంటున్నారు పూజా హెగ్డే. ఫెయిల్యూర్‌ని తీసుకోవడం గురించి పూజా మాట్లాడుతూ – ‘‘మనం కష్టపడి చేసిన పనికి అనుకున్న రిజల్ట్‌ రాకపోవచ్చు.

ఓడినంత మాత్రాన ప్రయాణం ఆగినట్టు కాదు.గెలిచినంత మాత్రాన ప్రయాణం పూర్తయినట్టూ కాదు. అయితే ఓడిపోయినప్పుడు కచ్చితంగా బాధపడతాం. నేనైతే ఒక పదిహేను నిమిషాలు మనస్ఫూర్తిగా ఏడ్చేస్తాను. బాధ మొత్తం పోతుంది. ఈ విషయం ‘ఓప్రా’ (ఫేమస్‌ అమెరికన్‌ ఫిలాంత్రఫిస్ట్‌) నుంచి నేర్చుకున్నాను. అలా అప్పటికప్పుడు మనం ఏదో ఒక విధంగా బాధను పోగొట్టుకోవాలి. మళ్లీ పాజిటివ్‌ మైండ్‌తో నెక్ట్స్‌ చాలెంజ్‌కు రెడీ అయిపోవాలి’’ అని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement