అమ్మకు ప్రేమతో... | Pooja Hegde bakes pizza for her mom | Sakshi
Sakshi News home page

అమ్మకు ప్రేమతో...

Apr 13 2020 12:24 AM | Updated on Apr 13 2020 4:48 AM

Pooja Hegde bakes pizza for her mom - Sakshi

పూజా హెగ్డే

‘‘లాక్‌ డౌన్‌ పూర్తయ్యేసరికి గిటార్‌ నేర్చుకుంటా’’ అని గిటార్‌ నేర్చుకుంటున్న ఫొటోను ఇటీవల పూజా హెగ్డే షేర్‌ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. పనిలో పనిగా తనలోని చెఫ్‌ను నిద్రలేపి వంటింట్లో ప్రయోగాలు చేస్తున్నారు. ఇటీవల హల్వా చేసిన పూజ ఇప్పుడు తన తల్లి (లత) కోసం పిజ్జా చేశారు. ‘‘మా చిన్నతనంలో అమ్మ మా కోసం పిజ్జా చేసి పెట్టేది.

ఇప్పుడు అమ్మ కోసం నేను పిజ్జా చేయగలుగుతున్నానని చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు పూజా. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రభాస్‌ ‘ఓ డియర్‌’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌), అఖిల్‌ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ చిత్రాల్లో కథానాయికగా నటిస్తున్నారు పూజ. అలాగే ‘కబీ ఈద్‌ కబీ దీవాలీ’ అనే హిందీ సినిమాలో సల్మాన్‌ సరసన నటించే చాన్స్‌ కొట్టేశారు. వీటితో పాటు తమిళంలో ఓ రెండు సినిమాల కథలను వినాల్సి ఉందని ఇటీవల సోషల్‌ మీడియా వేదికగా పేర్కొన్నారు పూజ.

Advertisement
 
Advertisement
Advertisement