ఆయన చాలా నేర్పించారు | Podhuvaga EmManasu Thangam Movie | Sakshi
Sakshi News home page

ఆయన చాలా నేర్పించారు

Aug 9 2017 2:37 AM | Updated on Sep 17 2017 5:19 PM

ఆయన చాలా నేర్పించారు

ఆయన చాలా నేర్పించారు

నటి నివేదా పేతురాజ్‌ ఇప్పుడు ఒకరకమైన టెన్షన్‌లో ఉంది. కారణం కోలీవుడ్‌లో తను నటిం చిన రెండో చిత్రం పొదువాగ ఎన్‌ మనసు తంగం చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది.

 నటి నివేదా పేతురాజ్‌ ఇప్పుడు ఒకరకమైన టెన్షన్‌లో ఉంది. కారణం కోలీవుడ్‌లో తను నటిం చిన రెండో చిత్రం పొదువాగ ఎన్‌ మనసు తంగం చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. ఉదయనిధిస్టాలిన్‌ కథానాయకిగా నటించిన ఈ చిత్రంలో నటుడు పార్తిబన్‌ ప్రధాన పాత్రను పోషించారు. ఇందులో నటించిన అనుభవం గురించి ఈ అమ్మడు తెలుపు తూ,ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా నటించడం మంచి అనుభవం అని పేర్కొంది.

 అయితే ఇందులో నటుడు పార్తిబన్‌కు కూతురుగా నటించానని చెప్పింది. ఆయ న నటన గురించి నాకు చాలా నేర్పించారని తెలిపింది. పార్తిబన్‌ తనకు తండ్రిగా నటిస్తున్నారని దర్శకుడు చెప్పతగానే సంతోషం కలిగినా, కాస్త భయం అనిపించిందని అంది. కారణం ఆయన చాలా సీనియర్‌ దర్శకుడు కావడమేనంది. ఈ చిత్రంలో తాను ఏ మాత్రం బాగా చేశానని అభినందనలు లభిస్తే ఆ క్రెడిట్‌ అంతా పార్తిబన్‌కే దక్కుతుందని అంతలా తనకు ఆయన ధైర్యం చెప్పారని నివేదా పేతురాజ్‌ పేర్కొంది. ఈ బ్యూటీ తాజాగా జయంరవికి జంటగా టిక్‌ టిక్‌ టిక్‌ చిత్రంలో నటిస్తోందన్నది గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement