ఆర్టీసీ బస్సులో ‘పైరసీ’ కలకలం 

Piracy Movie Played In RTC Bus - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్టీసీ బస్సులో పైరేటెడ్‌ సినిమా ప్రదర్శిస్తున్న వ్యవహారం వెలుగుచూసింది. హీరో నాని నటించిన కృష్ణార్జున యుద్ధం సినిమా విడుదలైన రెండో రోజే బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వస్తున్న గరుడ ప్లస్‌ బస్సులో ప్రదర్శిస్తున్న తీరును ఓ ప్రయాణికుడు మంత్రి కేటీఆర్‌కు ట్వీటర్‌ ద్వారా ఫిర్యా దు చేశారు. ‘ప్రభుత్వ సంస్థలే పైరసీని ప్రోత్సహిస్తే దీనికి ఎలా అడ్డుకట్ట పడుతుంది’అని ప్రశ్నించారు. దీనిని తీవ్రంగా పరిగణించిన కేటీఆర్‌ తగిన చర్యలు చేపట్టాలని ఆర్టీసీ ఎండీ రమణరావును ఆదేశించారు. దీంతో ఆయన సోమవారం విచారణకు ఆదేశించారు. ఆర్టీసీ గరుడ, గరుడ ప్లస్, సూపర్‌ లగ్జరీ బస్సుల్లో సినిమాలు ప్రదర్శించే అంశాన్ని ప్రైవేట్‌ సంస్థ కు అప్పగించినట్లు ఆర్టీసీ ఎండీ రమణరావు ‘సాక్షి’కి తెలిపారు. పైరసీ సినిమాలు ప్రదర్శిం చకూడదన్న ఒప్పందం ఉందని, దీనిపై చర్యలు చేపడతామని ఆయన అన్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top