పెళ్లాడండి.. ప్రేమించాక మాత్రమే | Pelladandi .. loves only | Sakshi
Sakshi News home page

పెళ్లాడండి.. ప్రేమించాక మాత్రమే

Mar 14 2014 11:34 PM | Updated on Jul 11 2019 9:16 PM

పెళ్లాడండి.. ప్రేమించాక మాత్రమే - Sakshi

పెళ్లాడండి.. ప్రేమించాక మాత్రమే

సనిమా పేరు ‘పెళ్లాడండి’. ‘ప్రేమించాక మాత్రమే’ అనేది ఉపశీర్షిక. విషు, ఇషా రంగనాథ్, నందు, త్రివేణి ముఖ్య తారలు.

 సనిమా పేరు ‘పెళ్లాడండి’. ‘ప్రేమించాక మాత్రమే’ అనేది ఉపశీర్షిక. విషు, ఇషా రంగనాథ్, నందు, త్రివేణి ముఖ్య తారలు. ఆర్.ఆర్. జరుగుల దర్శకుడు. ప్రసాద్ నల్లపాటి, లోహిత్ నిర్మాతలు. వంశీ, గణేశ్ కలిసి సంగీతాన్ని అందించిన ఈ చిత్రం పాటలను తమ్మారెడ్డి భరద్వాజ్, అల్లరి నరేష్ విడుదల చేశారు.

వీరితో పాటు పరుచూరి గోపాల్‌కృష్ణ, అశోక్‌కుమార్, రమేశ్ పుప్పాల, మల్టీ డైమన్షన్ వాసు అతిథులుగా పాల్గొని పాటలతో పాటు సినిమా కూడా విజయం సాధించాలనే ఆకాంక్షను వెలిబుచ్చారు. ‘‘ప్రేమలోని గొప్పతనం, అందులోని త్యాగ గుణమే ఈ సినిమా కథాంశం. సంస్కృతి సంప్రదాయాలతో కూడిన పెళ్లి ఎలా ఉంటుందో ఇందులో చూపిస్తున్నాం.

నేటి సమాజానికి కావాల్సిన అంశాలన్నీ ఇందులో ఉంటాయి’’ అని దర్శక, నిర్మాతలు చెప్పారు. నీలకంఠ,  అరవింద్ కృష్ణ, కొండవలస, రఘు, శివారెడ్డి, అడవిశేషు కూడా మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement