మన్మథుడి ముహూర్తం కుదిరే | Payal Rajput in Nagarjuna's Manmadhudu 2? | Sakshi
Sakshi News home page

మన్మథుడి ముహూర్తం కుదిరే

Feb 16 2019 2:55 AM | Updated on Jul 21 2019 4:48 PM

Payal Rajput in Nagarjuna's Manmadhudu 2? - Sakshi

నాగార్జున, పాయల్‌ రాజ్‌పుత్‌

స్త్రీలను అసహ్యించుకునే స్ట్రిక్ట్‌ బాస్‌లా ‘మన్మథుడు’ సినిమాలో నాగార్జున పంచిన కామెడీ ఎవర్‌ గ్రీన్‌. ఇప్పటికీ అందులోని పంచ్‌ డైలాగ్స్‌ ఫ్రెష్‌గానే పేలుతుంటాయి. లేటెస్ట్‌గా మన్మథుడు మళ్లీ  రావడానికి ముహూర్తం కుదిరింది.  2002లో నాగార్జున హీరోగా విజయ భాస్కర్‌ రూపొందించిన చిత్రం ‘మన్మథుడు’. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్‌ రూపొందనుంది. దర్శకుడిగా మారిన హీరో రాహుల్‌ రవీంద్రన్‌ ఈ సీక్వెల్‌ను తెరకెక్కించనున్నారు.

అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై నాగార్జున నిర్మించనున్నారు. ఈ సినిమాకు ‘మన్మథుడు 2’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. ఈ సినిమా ముహూర్తం మార్చి మొదటి వారంలో జరగనుందని టాక్‌. ఎక్కువ శాతం షూటింగ్‌ పోర్చుగల్‌లో జరుపుకోనున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ను ఎంపిక చేశారట. ఈ సీక్వెల్‌లో ‘మన్మథుడు’ క్యారెక్టరైజేషన్‌ను మాత్రమే తీసుకుంటారా? లేక వేరే కథను ప్లాన్‌ చేశారా? వేచి చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement