ఈసారి ఏం ప్రాజెక్ట్‌ బాబు? | Pawan Kalyan Trivikram Srinivas doing new film | Sakshi
Sakshi News home page

ఈసారి ఏం ప్రాజెక్ట్‌ బాబు?

Apr 16 2017 12:46 AM | Updated on Mar 22 2019 5:33 PM

ఈసారి ఏం ప్రాజెక్ట్‌ బాబు? - Sakshi

ఈసారి ఏం ప్రాజెక్ట్‌ బాబు?

బాబు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. పేరున్న కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు.

బాబు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. పేరున్న కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. ఆఫీసులో సాఫ్ట్‌వేర్‌ ప్రాజెక్ట్‌తో పాటు ఓ ఫ్యామిలీ ప్రాజెక్ట్‌నూ టేకప్‌ చేస్తాడు. బాబు మెయిన్‌ టార్గెట్‌ కూడా ఫ్యామిలీ ప్రాజెక్టే. అదేంటో ప్రేక్షకులకు తెలియాలంటే కొన్నాళ్లు వెయిట్‌ చేయాల్సిందే. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్‌ హీరోగా రూపొందుతోన్న సినిమా మెయిన్‌ పాయింట్‌ ఇదేనట! ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో పవన్‌కల్యాణ్, ఖుష్బూ, ఇతర ముఖ్య తారాగణంపై సాఫ్ట్‌వేర్‌ ఆఫీసు నేపథ్యంలో సీన్స్‌ తెరకెక్కిసున్నారు.

‘అత్తారింటికి దారేది’ తర్వాత పవన్, త్రివిక్రమ్‌ కలసి చేస్తున్న చిత్రమిది. అత్తారిల్లులో నదియా పవన్‌కు అత్తగా నటిస్తే... ఈ సినిమాలో ఖుష్బూ అత్త పాత్ర చేస్తున్నారు. అత్తారిల్లులో మేనత్తను తాతయ్యకు దగ్గర చేసే ప్రాజెక్ట్‌ను సక్సెస్‌ఫుల్‌గా ఫినిష్‌ చేసిన హీరో పాత్రలో పవన్‌ కనిపించారు. ఈ సినిమాలో ఏం ప్రాజెక్ట్‌ టేకప్‌ చేశారో? ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తీ సురేశ్, అనూ ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్లు. ‘దేవుడే దిగి వస్తే’, ‘ఇంజినీర్‌ బాబు’ టైటిల్స్‌ ఈ చిత్రానికి పరిశీలనలో ఉన్నాయట!

Advertisement
 
Advertisement
Advertisement