సైరా టీజర్‌పై పవన్‌ కామెంట్‌

Pawan Kalyan Reaction On Sye Raa Movie Teaser - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు కానుకగా చిరు కొత్త సినిమా సైరా నరసింహారెడ్డి టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. బర్త్‌డే వేడుకలను ఒక రోజు ముందుగానే తీసుకువచ్చిన ఈ టీజర్‌కు సూపర్బ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. అయితే ఈ టీజర్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని చిత్ర నిర్మాత, చిరు తనయుడు రామ్‌చరణ్‌ వెల్లడించారు.

చిత్ర యూనిట్ కాకుండా సైరా నరసింహారెడ్డి టీజర్‌ చూసిన తొలి వ్యక్తి పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ అని తెలిపారు. మంగళవారం సాయంత్రం జరిగిన చిరు పుట్టిన రోజు వేడుకల్లో ఈ విషయాన్ని వెల్లడించారు చరణ్. ‘నాకు సైరా టీజర్‌ ఫైనల్‌ అవుట్‌పుట్ 10.45కి వచ్చింది. వెంటనే నేను ఆ టీజర్‌ను కల్యాణ్ బాబాయ్‌కి ఫార్వర్డ్ చేశాను. 11.10కి బాబాయ్‌ దగ్గర నుంచి ‘టీజర్‌ అదిరిపోయింది. థియేటర్లో సినిమా చూసేందుకు రెడీ అవుతున్నాను’ అంటూ రిప్లయ్‌ వచ్చింది’ అని అభిమానులకు చెప్పారు చరణ్‌. శిల్పకళా వేదికలో జరిగిన చిరంజీవి జన్మదిన వేడుకలకు మెగా ఫ్యామిలీ హీరోలతో సినీ ప్రముఖులు హాజరయ్యారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top