పవన్ లేకుండానే షూటింగ్ స్టార్ట్ | Pawan Kalyan film To starts from Tomorrow Without Pawan kalyan | Sakshi
Sakshi News home page

పవన్ లేకుండానే షూటింగ్ స్టార్ట్

Aug 4 2016 1:16 PM | Updated on Mar 22 2019 5:33 PM

పవన్ లేకుండానే షూటింగ్ స్టార్ట్ - Sakshi

పవన్ లేకుండానే షూటింగ్ స్టార్ట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఈ నెల ఆరో తేదిన పట్టాలెక్కబోతోంది. ఇప్పటికే కథ కథనాలు సిద్ధంగా ఉన్న ఈ సినిమాకు గోపాల గోపాల ఫేం డాలీ దర్శకుడు. పవన్ సన్నిహితుడు శరత్ మరార్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఈ నెల ఆరో తేదిన పట్టాలెక్కబోతోంది. ఇప్పటికే కథ కథనాలు సిద్ధంగా ఉన్న ఈ సినిమాకు గోపాల గోపాల ఫేం డాలీ దర్శకుడు. పవన్ సన్నిహితుడు శరత్ మరార్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు తమిళ దర్శకుడు ఎస్ జె సూర్య దర్శకత్వం వహించాల్సి ఉన్నా.. ఆయన నటుడిగా బిజీ కావటంతో డాలీని తీసుకున్నారు.

అయితే ఈ సినిమా షూటింగ్ 6వ తేది నుంచి ప్రారంభమవుతున్నా.. ఆ షూటింగ్లో పవన్ పాల్గొనే అవకాశం లేదన్న టాక్ వినిపిస్తోంది. కారణాలేంటో తెలియకపోయినా.. మరో వారం తరువాతే పవన్ షూటింగ్కు హారవుతారని తెలుస్తోంది. అయితే గతంలో సర్థార్ గబ్బర్సింగ్ షూటింగ్ సమయంలో కూడా పవన్ తొలి షెడ్యూల్కు హాజరు కాలేదు. దీంతో ఇది పవన్ సెంటిమెంట్ అన్న టాక్ కూడా వినిపిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement