పవన్ మాట నిలబెట్టుకున్నాడా? | Pawan kalyan Anoop rubens and dolly once again working toghther | Sakshi
Sakshi News home page

పవన్ మాట నిలబెట్టుకున్నాడా?

Jun 23 2016 9:12 AM | Updated on Mar 22 2019 5:33 PM

పవన్ మాట నిలబెట్టుకున్నాడా? - Sakshi

పవన్ మాట నిలబెట్టుకున్నాడా?

సర్థార్ గబ్బర్ సింగ్ సినిమాతో నిరాశపరిచిన పవన్ ప్రస్తుతం తన నెక్ట్స్ సినిమా మీద దృష్టిపెట్టాడు. ఇప్పటికే కథ రెడీ అయిపోయినా సాంకేతిక నిపుణులు, నటీనటుల ఎంపిక జరుగుతోంది.

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో నిరాశపరిచిన పవన్ ప్రస్తుతం తన నెక్ట్స్ సినిమా మీద దృష్టిపెట్టాడు. ఇప్పటికే కథ కూడా రెడీ అయిపోయినా సాంకేతిక నిపుణులు, నటీనటుల ఎంపిక జరుగుతోంది. ముందుగా ఈ సినిమాను తమిళ దర్శకుడు ఎస్ జె సూర్య దర్శకత్వంలో చేయాలని భావించిన పవన్, ఆ తర్వాత మరో దర్శకుడితో చేసేందుకు రెడీ అవుతున్నాడు.

గోపాల గోపాల సినిమా ఆడియో ఫంక్షన్ లో ఆ చిత్ర దర్శకుడు డాలీకి, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ కు మరో అవకాశం ఇస్తానంటూ సభాముఖంగా పవన్ చెప్పాడు. ఇప్పుడు తన తాజా చిత్రానికి ఆ ఇద్దరి తీసుకున్నాడు. సంగీత దర్శకుడిగా అనూప్ ను ఎప్పుడో కన్ఫామ్ చేసిన పవన్, ఇటీవలే డాలీని దర్శకుడిగా ఎనౌన్స్ చేశాడు. దాంతో... అప్పుడు ఇచ్చిన మాట ప్రకారమే పవన్ వాళ్లకు చాన్స్ ఇచ్చాడని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement