డైవింగ్‌ లైఫ్‌! | Parineeti Chopra enjoys scuba diving in the Great Barrier Reef | Sakshi
Sakshi News home page

డైవింగ్‌ లైఫ్‌!

May 3 2018 5:31 AM | Updated on May 3 2018 5:31 AM

Parineeti Chopra enjoys scuba diving in the Great Barrier Reef - Sakshi

పరిణీతి చోప్రా, స్కూబా డైవ్‌ చేస్తూ..

కాస్త టైమ్‌ దొరికితే చాలు హాలిడేకి చెక్కేస్తున్నారు హీరోయిన్‌ పరిణీతి చోప్రా. డైవింగ్‌ లైఫ్‌ను ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తున్నారు. ఆల్రెడీ ఆమె స్కూబా డైవింగ్‌లో సర్టిఫికెట్‌ తెచ్చుకున్నారు. లాస్ట్‌ టైమ్‌ మాల్దీవుల్లో మస్తీ చేసిన పరిణీతి ఇప్పుడు ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌ సమీపంలోని గ్రేట్‌ బారియర్‌ రిఫ్‌లో డైవింగ్‌ లైఫ్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు.‘‘ఆస్ట్రేలియాలో డైవింగ్‌ లైఫ్‌ను ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తున్నాను.

చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు పరిణీతి చోప్రా. పొఫెషనల్‌ లైఫ్‌లో కూడా ఫుల్‌ బిజీగా ఉన్నారామె. అర్జున్‌ కపూర్‌ హీరోగా రూపొందుతున్న ‘సందీప్‌ ఔర్‌ పింకీ ఫరార్, నమస్తే ఇంగ్లాండ్‌’ సినిమాల్లో పరిణీతిచోప్రా కథానాయికగా నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు ఈ ఏడాది రిలీజ్‌ కానున్నాయి. అక్షయ్‌కుమార్‌ హీరోగా నటిస్తున్న ‘కేసరి’ సినిమాలో కూడా పరిణీతినే కథానాయిక.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement