కొత్తగా ఉండే జంట | Pair with new looks | Sakshi
Sakshi News home page

కొత్తగా ఉండే జంట

Apr 8 2014 11:27 PM | Updated on Sep 2 2017 5:45 AM

కొత్తగా ఉండే జంట

కొత్తగా ఉండే జంట

‘‘ఈ ప్రచార చిత్రం బావుంది. దర్శకుడు మారుతి కొత్త జంటను కొత్తగా ఆవిష్కరించాడు’’ అని అల్లు అరవింద్ చెప్పారు. అల్లు శిరీష్, రెజీనా జంటగా మారుతి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ‘కొత్త జంట’ ప్రచార చిత్రాన్ని మంగళవారం హైదరాబాద్‌లో జగపతిబాబు ఆవిష్కరించారు.

 ‘‘ఈ ప్రచార చిత్రం బావుంది. దర్శకుడు మారుతి కొత్త జంటను కొత్తగా ఆవిష్కరించాడు’’ అని అల్లు అరవింద్ చెప్పారు. అల్లు శిరీష్, రెజీనా జంటగా మారుతి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ‘కొత్త జంట’ ప్రచార చిత్రాన్ని మంగళవారం హైదరాబాద్‌లో జగపతిబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లా డుతూ -‘‘ఈ టీమ్ ఎనర్జీ లెవెల్స్ బావున్నాయి. బన్నీ వాసు దగ్గరుండి ఈ సినిమా రూపొందించాడు’’ అన్నారు. గీతా ఆర్ట్స్ సంస్థలో పనిచేయాలన్న తన కల ఈ సినిమాతో నెరవేరిందని మారుతి చెప్పారు. ఈ నెల 12న పాటలను, మే 1న చిత్రాన్ని విడుదల చేస్తామని బన్నీ వాసు తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్లు శిరీష్, జెబి, డీఎమ్‌కె, బాబు నాయక్, రావిపల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement