విష్ణు విశాల్‌ చిత్రంలో.. | Oviya's comeback film with Vishnu Vishal | Sakshi
Sakshi News home page

విష్ణు విశాల్‌ చిత్రంలో..

Aug 9 2017 2:07 AM | Updated on Apr 3 2019 9:13 PM

విష్ణు విశాల్‌ చిత్రంలో.. - Sakshi

విష్ణు విశాల్‌ చిత్రంలో..

నటి ఓవియ ఇప్పుడు వార్తల్లో నటే కాదు, ఒక్కసారిగా పిచ్చ క్రేజ్‌ తెచ్చుకున్న హీరో యిన్‌ అయిపోయింది.

నటి ఓవియ ఇప్పుడు వార్తల్లో నటే కాదు, ఒక్కసారిగా పిచ్చ క్రేజ్‌ తెచ్చుకున్న హీరో యిన్‌ అయిపోయింది. అంతా బిగ్‌బాస్‌ రియాలిటీ షో పుణ్యమే. ఆ షోలో పాల్గొనే ముందు కొన్ని చిత్రాల్లో నాయకిగా నటించినా పెద్దగా రాని పేరు, బిగ్‌బాస్‌ రియాలిటీ షో నుంచి వైదొలిగిన తరువాత కూడా వచ్చేసింది. నిజం చెప్పాలంటే ఓవియ ను ఆ రియాలిటీ షోలో కొనసాగాలనే అధిక సంఖ్యలో అభిమానులు కోరుకున్నారు. ఇక గేమ్‌ షోలో ఉన్నప్పుడు నటుడు ఆరమ్‌ను నటి ఓవియ ప్రేమించిందనే ప్రచారం కలకలానికి దారి తీసిం ది.

కాగా షో నుంచి బయటకొచ్చిన ఓవియ నగరంలోని ఒక సినీ మాల్‌కు వెళ్లగా అక్కడ ఆమెను చూడడానికి ప్రేక్షకులు గుమిగూడారు. ఇదంతా బిగ్‌బాస్‌ రియాలిటీ షో తెచ్చి పెట్టిన క్రేజ్‌ అయితే, ఆ క్రేజ్‌ను విష్ణువిశాల్‌ టీమ్‌ తమ చిత్రానికి ఉపయోగించుకుంటున్నారు. అవును విష్ణువిశాల్, రెజీ నా జంటగా నటిస్తున్న సిలుక్కువార్‌పట్టి సిం గం చిత్రంలో నటి ఓవియ ఒక ప్రత్యేక పాత్రలో నటించడానికి రెడీ అవుతోంది.

నిజానికి ఈ చిత్రంలో నటించడానికి నటి ఓవియ బిగ్‌బాస్‌ షోలో పాల్గొనడానికి ముందే అంగీకరించినా, అందులోంచి బయట కు వచ్చిన తరువాత నటిస్తున్న తొలి చి త్రంగా సిలుక్కువార్‌పట్టి సింగం చి త్రం నమోదు కావడంతో ఆ చిత్రానికి మంచి ప్రచారం లభిస్తోంది. ఈ అమ్మ డు మళ్లీ బిగ్‌బాస్‌ రియాలిటీ షో హౌస్‌ లోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు ప్ర చారం జరుగుతోంది. వైల్డ్‌కార్డు ద్వారా నటుడు భరణి, ఓవియ బిగ్‌బాస్‌ షోకు రీ ఎంట్రీ అవ్వవచ్చునట. అయితే ఈ విషయంలో నటి ఓవియ ఎలాంటి నిర్ణ యం తీసుకుంటుందో వేచి చూడాలి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement